తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రుల నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఉన్నారు. ఈ తరానికి చెందిన హీరోలలో ఇప్పటికి చాలామంది 60 సంవత్సరాల వయసు దాటినా కానీ నటిస్తూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగార్జున. ఇప్పటికీ 60 సంవత్సరాల వయసు ఉన్నా కానీ కుర్ర హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు.
Advertisement
అలాంటి నాగార్జునపై ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ లేవు కానీ, లక్ష్మీకి విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకోవడమే కాస్త వివాదంగా మారింది. అయితే ఈ సమయంలో ఏఎన్ఆర్ కూడా అడ్డు చెప్పారట. వారి పెళ్లికి అసలు ఒప్పుకోలేదట. మరి పెళ్లి ఎలా జరిగిందో పూర్తిగా చూద్దాం.. నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చే సమయానికి ముందే నాగచైతన్య పుట్టారు. లక్ష్మీని విడిచి పెట్టిన తర్వాత అమలతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి “కిరాయి దాదా” అనే చిత్రంలో నటించే టైంలో స్నేహబంధం ఏర్పడింది.
Advertisement
ఆ తర్వాత శివా సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. చివరికి ఏఎన్ఆర్ కు తెలియడంతో ఆయన నిరాకరించారు. కానీ నాగార్జున ఆమెని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి బయటకు వచ్చేసారు. ఈ తరుణంలో కిరాయి దాదా సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన దొరస్వామి రాజు పెళ్లి పెద్దగా ఉండి తిరుపతిలో వివాహం జరిపించారు.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- హాలిడేస్ లో ఇంటికి వచ్చిన చెల్లెలు..మా వారినే లేపుకుపోయింది..!!
- పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు
- 400కు పైగా సినిమాల్లో నటించిన ఈ నటుడి గురించి మీకు తెలుసా?