Home » 400కు పైగా సినిమాల్లో న‌టించిన ఈ న‌టుడి గురించి మీకు తెలుసా?

400కు పైగా సినిమాల్లో న‌టించిన ఈ న‌టుడి గురించి మీకు తెలుసా?

by Azhar
Ad

దాదాపు 400 సినిమాల్లో న‌టించిన ఈ న‌టుడి పేరు ప‌గ‌డాల త్యాగ‌రాజు. ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌ల్లో త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్న‌ త్యాగ‌రాజు అతి త‌క్కువ కాలంలో ఎక్కువ సినిమాల్లో న‌టించాడు. వ‌రంగ‌ల్ కు చెందిన త్యాగ‌రాజు ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పిజి పూర్తిచేశాడు. మొదటిసారిగా పదేళ్ల వయసులో త‌న స్కూల్ ఫంక్ష‌న్ లో ఒక నాటకంలో ఆడపిల్ల వేషం వేశాడు. ఆ నాటకాన్ని చూసిన అప్పటి హైదరాబాదు స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు త్యాగ‌రాజును అభినందిస్తూ ప్రత్యేక బహుమతి అందజేశారు.

Advertisement

Advertisement

నాట‌కాల‌పై ఉన్న ఆస‌క్తి, స్నేహితులు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు మ‌ద్రాసు వెళ్లిన త్యాగ‌రాజు ద‌ర్శ‌కుడు ప్ర‌త్య‌గాత్మ‌ను క‌లిసి త‌న‌కు అవ‌కాశ‌మివ్వాల్సిందిగా కోర‌గా ప్ర‌త్య‌గాత్మ తాను డైరెక్ష‌న్ చేస్తున్న‌ మంచి మనిషి సినిమాలో విలన్‌గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ హీరో…అలా త్యాగ‌రాజుకు 1964లో సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ త‌ర్వా ‘పల్నాటి యుద్ధం’ (1966)లో వీరభద్రుడి వేషం, రంగుల రాట్నం (1967)లో వాణిశ్రీ తండ్రి వేషంతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. బందిపోటు దొంగ, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వేషాలకు త్యాగరాజు ఫ‌ర్ఫెక్ట్ గా సూట్ అయ్యేవాడు అందుకే అప్ప‌ట్లో వ‌చ్చిన అన్ని సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగా త్యాగ‌రాజే ఉండేవాడు. విల‌న్ పాత్ర‌లో మెప్పించిన త్యాగ‌రాజు ‘పాప కోసం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ వంటి చిత్రాల్లో సాత్విక పాతలు ధరించి ప్రేక్షకుల సానుభూతిని పొందాడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో మొత్తం 400 చిత్రాలకు పైగా న‌టించాడు.

Visitors Are Also Reading