నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి తెలియని వారు ఉండరు. అయితే గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న రఘురామకృష్ణ రాజు… ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఆయన చెబుతున్న మాటలను బట్టి… తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో రఘురామరాజు చేరతారని మనకు అర్థమవుతుంది. మరి ఒకసారి ఆయన వ్యాఖ్యలు చూసినట్లయితే…ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సిగ్గు, మానవత్వం ఉంటే తమ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని, పోలవరం ప్రాజెక్టును ఇంతగా సర్వనాశనం చేసిన తమ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని, తమ పార్టీకి ఓటు అడుగే హక్కు లేదని చెబుతున్న తనకు కూడా ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుందని సందేహం మీడియా ప్రతినిధులకు రావచ్చునని తెలిపారు రఘురామరాజు.
Advertisement
Advertisement
రానున్న ఎన్నికల్లో తాను ఈ పార్టీ నుంచి పోటీ చేసేది లేదని, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా… ఇప్పటికే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, మూడవ పార్టీ కూడా కలిస్తే ఆ మూడు పార్టీలలో ఒక పార్టీ తరఫున తాను బరిలోకి దిగుతానని లేని పక్షంలో రెండింటిలో ఒక పార్టీ తరఫున పోటీ చేయడం ఖాయమని అన్నారు రఘురామరాజు. పొత్తులో భాగంగా నరసాపురం స్థానం ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీ తరఫున తాను పోటీ చేయగలననేది తన నమ్మకమని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్నది ప్రజా ప్రభుత్వమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుుర్తు చేశారు.
భగీరథ జయంతి ఉత్సవాల సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారిని అపర భగీరధుడిగా కొంత మంది కీర్తించడం చూస్తుంటే వారి మైండ్ దొబ్బిందేమో నన్న అనుమానం కలిగిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకున్న పోలవరం ప్రాజెక్ట్ ను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు.