తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలుంటాయి. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. అలాంటి మెగా ఫ్యామిలీలో నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ ఆయన బ్యాచిలర్ గానే ఉన్నారు. అయితే త్వరలోనే ఆయన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పనున్నారట.
Advertisement
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠితో ఆయన ప్రేమ వ్యవహారం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. వచ్చే నెల జూన్ లో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్. మెగా ఫ్యామిలీతో పాటు అతి కొద్ధి మంది బంధుమిత్రుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందట. ఆ తర్వాత లావణ్య, వరుణ్ తమ రిలేషన్ ను అనౌన్స్ చేయనునట్టు సమాచారం అందుతుంది.
Advertisement
2023 చివర్లో వీరి వివాహం జరిపించడం కోసం ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వరుణ్ లావణ్య ఇద్దరు మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఇక అప్పటి నుంచే వీరు ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. దీనికి తోడుగా మెగా ఫ్యామిలీ లో జరిగే ఈవెంట్స్ లో లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఈ వార్తలకు బలం చేకూరినట్టయింది. అంతేకాకుండా నాగబాబు కూడా వరుణ్ తేజ్ కు త్వరలో వివాహం ప్రకటించడం మెగా అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ ఇంత త్యాగం చేశారా.. ఎవరికి తెలియని నిజం..!!
- Sr.ntr:సీఎంనే ఇంట్లోకి రానివ్వని సీనియర్ ఎన్టీఆర్.. కారణం తెలిస్తే..!!
- ఛీ..ఛీ..సాయి పల్లవి 7thలోనే అలాంటి పని చేసి తల్లికి దొరికిందా.. ఏం జరిగిందంటే..!!