Home » Sr.ntr:సీఎంనే ఇంట్లోకి రానివ్వని సీనియర్ ఎన్టీఆర్.. కారణం తెలిస్తే..!!

Sr.ntr:సీఎంనే ఇంట్లోకి రానివ్వని సీనియర్ ఎన్టీఆర్.. కారణం తెలిస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆయన ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేతిలో బొకే పట్టుకొని ఆ ఇంటి ముందుకు వెళ్లారు. గుమ్మం ముందు నిలబడిన ఆయన లోపలికి రానివ్వలేదు.. సినిమా కథ ఏమైనా చెబుతున్నారని అనుకుంటున్నారా.. కాదు కాదు ఇది రియల్ గా జరిగిన స్టోరీ. సీఎం వ్యక్తి సీఎం పదవి వచ్చిన తర్వాత మొదటిసారి కలుద్దామని ఆయన దగ్గరికి వెళ్తే అరగంటసేపు నిలబెట్టుకొని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఇది తెలుగు రాష్ట్రంలో జరిగిన కథ.. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. ఒక సీఎం అంటే ప్రోటోకాల్ తప్పనిసరిగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లాలి అనేది ముందుగానే నిర్ణయిస్తారు. ఆయన వెళ్లే స్థలానికి ముందుగానే సెక్యూరిటీ వాళ్ళు వెళ్లి అన్నీ చూసుకుంటారు.. కానీ అలాంటివేవీ లేకుండా సీఎం ఆయన ఇంటికి వెళితే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా బయటకు పంపేశారు.

Advertisement

ఇంతకీ ఈ రియాలిటీ స్టోర్ ఎవరిదయ్యా అంటే.. మామా అల్లుళ్లదే.. గుర్తుకు వచ్చిందా.. చంద్రబాబు నాయుడు మరియు ఎన్టీఆర్ మధ్య జరిగిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్ ను గద్దె దించి నెలరోజుల్లో వైస్రాయి ఎపిసోడ్ తర్వాత సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే బంజారా హిల్స్లోని ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు. కానీ అక్కడ అనుకోని సీన్ నడిచింది.. మహాభారత యుద్ధంలో అర్జునుడు భీష్ముని వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కి తాతా నువ్వు ఎప్పుడు చస్తావు ఆశీర్వదించు అన్నట్టు.. ఇలాంటి సేమ్ సీన్ ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య నడిచింది.. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేసి చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. దీంతో ఎంతో బాధపడి కుమిలిపోతున్న ఎన్టీఆర్ ఇంటికి పరిమితమైన సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేరుగా ఎన్టీఆర్ ఇంటికి బొకే పట్టుకొని వెళ్లారు.

Advertisement

కానీ ఎన్టీఆర్ అరగంట సేపు అయినా కానీ లోపలికి రానీవ్వలేదట. దీంతో చంద్రబాబు నాయుడు చివరి వరకు వెయిట్ చేసి చేసి వెనక్కి వెళ్లిపోయారట. ఈ విధంగా ఎన్టీఆర్ ఆయన్ను లోపలికి రానివ్వకపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తనకు వెన్నుపోటు పొడిచి చివరికి తన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాడు అంటే చంద్రబాబులో 100% రాజకీయ నాయకుడు ఉన్నాడని ఆ సీన్ ఋజువు చేసింది. అది 1995ఆగస్టులో అసెంబ్లీ సమావేశం.. అప్పటికి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ ను దించేయాలని అందరూ చూస్తున్నారు. సభలో ఎన్టీఆర్ ఎంత మాట్లాడదామని ట్రై చేసినా స్పీకర్ గా ఉన్న యనమాల రామకృష్ణుడు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అదే ఎన్టీఆర్, బాబు ముఖాముఖి చూసుకున్న చివరి సందర్భం. అందుకే బాబు ఇంటికి వచ్చినా కానీ ఎన్టీఆర్ లోనికి రానివ్వలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణించారు. అధికారం నుంచి దించేసాక ఎన్టీఆర్ మృతదేహం వద్దకే బాబు వెళ్లారు. కానీ ఆయన బతికున్నప్పుడు అస్సలు కలవనివ్వలేదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading