Home » నాగశౌర్య ‘రంగబలి’కి రెడీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

నాగశౌర్య ‘రంగబలి’కి రెడీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైనటువంటి నాగశౌర్య ఇటీవలే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలీం థియేటర్ దగ్గర జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఇప్పుడు రంగబలి అనే సినిమాతో వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాని గత ఏడాది ఉగాది కానుకగా ప్రకటించేశారు. ఏమైందో గానీ ఈ మూవీ నుంచి మళ్లీ ఏడాది ఉగాది వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఉగాది రోజునే సినిమా టైటిల్ ని ప్రకటించేస్తూ.. షూటింగ్ జరుగుతుందని తెలియజేసారు.  

Also Read :   “పరుగు” మూవీ హీరోయిన్ షీలా కౌర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

Advertisement

తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి విడుదల తేదీ ప్రకటించేశాడు. విడుదల తేదీ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ లో నాగశౌర్య లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. నాని దసరా సినిమాని తెరకెక్కించిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ సినిమాని దర్శకత్వం చేయబోతున్నాడు. 

Advertisement

Also Read :  Malli Pelli : నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ విడుదల… రమ్యకు దించి పడేశాడుగా!

Manam News

ఇటీవలే ఈ నిర్మాణ సంస్థ దసరా మూవీకి కూడా కొత్త దర్శకుడితోనే తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకుంది.  దీంతో ఆడియన్స్ లో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అదేవిధంగా అప్ కమింగ్ మ్యూజిక్ దర్శకుడు పవన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ అండ్ ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నాగశౌర్య ఈ మూవీతో పాటు పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి అనే సినిమాలను కూడా చేస్తున్నాడు. నాగశౌర్య నటించే ఈ సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరి. 

Also Read :  పెళ్లికి ముందే చాలా మందితో డేటింగ్ చేశా… ఆ పని కూడా : ప్రియాంక చోప్రా

Visitors Are Also Reading