పండ్లలో తక్కువ ధరకి వచ్చే పండ్లు అరటి పండ్లు. అరటిపండు డజన్ 40 నుండి 30 రూపాయల మధ్య ఉంటాయి. ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే ఆకలి కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా వెంటనే ఎనర్జీ వస్తుంది కాబట్టి అరటిపండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు.
Also Read: రష్మికతో గోవాలో ఎంజాయ్…తమ్ముడు చేసిన తప్పుతో దొరికిపోయిన రౌడీ…!
Advertisement
అయితే అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తింటే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అరటిపండ్లను తినకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
1)స్థూలకాయం
అరటిపండు లో ఫైబర్ మరియు సహజ చక్కెర ఉంటుంది. అరటిపండు తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు కాబట్టి స్థూలకాయంతో బాధపడే వారు అరటి పండ్లను తినకూడదు.
Advertisement
2)అసిడిటీ
అరటి పండ్లను తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బనానాలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాంతో ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
3)షుగర్ పేషెంట్లు
మధుమేహంతో బాధపడే వారు ఎక్కువగా అరటి పండ్లను తినకూడదు. అరటి పండులో చక్కెర శాతం ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోకపోవడం మంచిది.
4)అలర్జీలు
కొంతమందికి ఫుడ్ అలర్జీ ఉంటుంది. అలా అరటిపండు అలర్జీ ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే అలర్జీ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
5) మైగ్రేన్
మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారు అరటిపండ్ల కు దూరంగా ఉండాలి. అరటిపండ్లలో టైరమైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మైగ్రేన్ ను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీని వల్ల మైగ్రేన్ తలనొప్పి మరింత పెరగవచ్చు.
6)మలబద్ధకం
అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. అరటిపండ్లలో ఉండే టానైన్ యాసిడ్ జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్న వారు అరటి పండ్లను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
Also Read: తల్లి కాబోతున్న కాజల్.. వాటితో కన్మర్మ్ చేసిన భర్త గౌతమ్..?