Home » త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌.. వాటితో క‌న్మ‌ర్మ్ చేసిన భ‌ర్త గౌత‌మ్‌..?

త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌.. వాటితో క‌న్మ‌ర్మ్ చేసిన భ‌ర్త గౌత‌మ్‌..?

by Bunty
Ad

సాధార‌ణంగా పెళ్లి అయిన త‌రువాత ఎవ‌రినైనా అడిగే ప్ర‌శ్న‌. ఏదైనా శుభ‌వార్త ఉందా అని..? అడుగుతుంటారు. ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ విష‌యం కూడా అదే జ‌రుగుతూ ఉంది. ఈమె గురించి ఇటీవ‌ల ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. కాజ‌ల్ త‌ల్లి కాబోతుంది అని.. అందుకే కొత్త సినిమాల‌కు కూడా ఓకే చెప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వివాహం జ‌రిగిన త‌రువాత కూడా ఈమె స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది అంటే.. ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. చందమామ రేంజ్ ఏమిటో..? ఇప్పుడు కూడా ఇలాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తున్న‌ది కాజల్‌. చిరంజీవి ఆచార్య‌, క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్ 2 సినిమాల్లో ఈమె మెయిన్ హీరోయిన్.

 

Advertisement

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు పోయినా కూడా ఇప్ప‌టికీ కాజ‌ల్ రేంజ్ మాత్రం అలాగే ఉన్న‌ది. సినిమాకు 2 కోట్ల వ‌ర‌కు పారితోష‌కం అందుకుంటూ అద‌ర‌హో అనిపిస్తుంది కాజ‌ల్‌. మంచి స్టేజీలో ఉన్న‌ప్పుడే గ‌త ఏడాది గౌత‌మ్ కిచ్లును మనువాడింది కాజ‌ల్‌. పెళ్లి త‌రువాత కూడా సినిమాలు మాత్రం ఆప‌డం లేదు. పెళ్లికి ముందే కండీష‌న్లు అప్లై అనేసింది ఈ ముద్దుగుమ్మ‌. కెరీర్‌కు అడ్డురాని పెళ్లి మాత్ర‌మే చేసుకుంటాను అని చెప్పేసింది ఈమె. అందుకే పెళ్లి త‌రువాత కూడా వ‌రుస సినిమాల‌తో దూకుడు చూపిస్తుంది కాజ‌ల్‌. ఈమె గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న‌ది. అందుకే కొత్త సినిమాల‌కూ ఓకే చెప్ప‌డం లేదు అని.. భ‌ర్త గౌత‌మ్ ఓ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ఇటీవ‌ల కాలంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న ప్రెగ్నెన్సీపై వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ది. ప్ర‌స్తుతం త‌న గ‌ర్భం గురించి మాట్లాడుకోవ‌డం లేదు అని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా మాట్లాడుతాను అని చెప్పింది. మాతృత్వం అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో గొప్ప‌వ‌రం అని, తాను కూడా దానిని అనుభ‌వించాల‌నుకుంటున్నాన‌ని చెప్పింది కాజ‌ల్‌. గౌత‌మ్ త‌న సోష‌ల్ మీడియా పేజీలో ఫొటో షేర్ చేశాడు. దీంతో పాటు పోస్ట్ చేసిన ఎమోజీలో నీ కోస‌మే చూస్తున్న అంటూ మెసెజ్ చేశాడు. అందులో పాప ఫొటో కూడా ఉండ‌డం విశేషం. ముగ్గురు ఉన్న్టు అందులో క్లియ‌ర్‌గా క‌నిపిస్తుంది. దానిని బ‌ట్టి చూస్తే కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అనే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు గౌత‌మ్ కిచ్లు. మ‌రొక వైపు కాజ‌ల్ ఈ విష‌యంలో ఎగ్జైటింగ్‌గా అనిపించినా.. మ‌రొక‌వైపు కాస్త నెర్వ‌స్‌గా పీల్ అవుతున్న‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతం ఈమె బేబీ బంప్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.

Visitors Are Also Reading