తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుదల చేశారు. హైదరాబాదులోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. రెండింటిలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది.
Read also : సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్..కేబినెట్ హోదాతో కీలక పదవి!!
Advertisement
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33వేల 82 మంది హాజరు కాగా వీరిలో 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది A గ్రేడ్ లో పాస్ కాగా, 68,335 మంది B గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించారు.
Advertisement
READ ALSO : Adipurush Trailer : “ఆది పురుష్” ట్రైలర్ రిలీజ్…దుమ్ములేపిన ప్రభాస్
అమ్మాయిలు 68% మంది ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 56.82 శాతం మంది పాస్ అయ్యారు. మేడ్చల్ జిల్లా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి వెల్లడించారు. జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
READ ALSO : KHUSHI : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల… సమంత అదరగొట్టింది!