నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. తారకరత్ననీ పెళ్లి చేసుకోకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్య రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. అలేఖ్య రెడ్డికి తారకరత్న కంటే ముందే పెళ్లి జరగడం… అతనితో వివాదాలు తలెత్తి విడాకులు ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలేఖ్య.
READ ALSO : Samantha : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో విడుదల…
Advertisement
ఈ పెళ్లితో తారకరత్న కుటుంబ సభ్యులు కూడా వీరికి దూరమయ్యారు. అయితే నందమూరి తారకరత్న ఇటీవల మరణించడంతో అలేఖ్య ఒంటరి అయిపోయింది. సోషల్ మీడియాలోనే తన ఖాతా ద్వారా తన భర్తతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అటు అలేఖ్య తరచుగా భర్తపై తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
Advertisement
READ ALSO : గరుడ పురాణం చుట్టూ తిరిగే “ఊరు పేరు భైరవ కోన”… అదిరిపోయిన టీజర్
అలేఖ్య తన భర్త చివరి కోరిక తీర్చడానికి సిద్ధమవుతున్నారట. ఎమ్మెల్యేగా టిడిపి తరఫునుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి ఆమె పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సంగతి ఏంటంటే? తనకు ఎంతో ఇబ్బందిగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టడానికి చాలా ఏళ్ల నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తారకరత్న తన మరణానికి ముందు గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేయాలని భావించారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారట.
READ ALSO : Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!