Home » చైతన్య చనిపోవడానికి కారణం అప్పులు కాదు.. ఫ్రెండ్ శ్రీరామ్ ఏం చెప్పాడంటే ?

చైతన్య చనిపోవడానికి కారణం అప్పులు కాదు.. ఫ్రెండ్ శ్రీరామ్ ఏం చెప్పాడంటే ?

by Anji
Ad

ఢీ డాన్స్ షో ద్వారా అందరికీ సుపరిచితుడైన చైతన్య మాస్టర్ ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే.  నెల్లూరులోని క్లబ్ హోటల్ అకస్మాత్తుగా మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎప్పుడూ అందరిని నవ్విస్తూ.. సరదాగా ఉండే చైతన్య మాస్టర్ ఒక్కసారిగా దూరమవ్వడం ఢీ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్లు అలాగే బాయ్స్ ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో ఇంట్లో వాళ్లకు స్నేహితులకు ఢీ మిత్రులందరికీ సారీ చెప్పి ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు చెప్పి ఉరి వేసుకున్న చైతన్య మాస్టర్ గురించి ఆయన స్నేహితుడు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Also Read :  నరేష్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

Advertisement

Advertisement


చైతన్య మాస్టర్ *త్మ*త్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పి మరణించారు. అయితే ఆయన స్నేహితుడు శ్రీరామ్ మాత్రం చైతన్య చనిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కాదంటూ వెల్లడించారు. తాను అడిగితే సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని.. అయితే ఆర్థిక ఇబ్బందులు కూడా మరీ అంత ఎక్కువగా ఏమీ లేవని తెలిపారు. చనిపోయే రెండు రోజుల ముందు కూడా తాను కాల్ చేసి పేమెంట్స్ ఇచ్చే వాళ్ళు ఇవ్వడం లేదు అని మాత్రం చెప్పాడు.

Manam News
నేనే వచ్చి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోవాలి అని చెప్పి చాలా వరకు మెంటల్ టెన్షన్స్ తగ్గించుకుందామని అనుకుంటున్నాను. రెండు నెలల్లో పెళ్లి ఫిక్స్ అవ్వబోతోంది ఆ లోపు అన్ని క్లియర్ చేసుకొని సెటిల్ అవుతాను అంటూ చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతాను అంటూ చెప్పాడు. సోమవారం వచ్చాక మాట్లాడుతానని చెప్పినవాడు ఇలా చేస్తాడని అస్సలు  అనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటూ చెప్పారు.

Also Read :   లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన హీరోలు..ఎవరంటే..?

Visitors Are Also Reading