Home » కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

by Anji
Ad

అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి దూకుడును ప్రదర్శించింది. భారత్ లో అందుబాటులో ఉన్న 14 యాప్స్  నిషేదిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక నుంచి దేశంలో ఈ 14 రకాల యాప్స్ అందుబాటులో ఉండవు.  **వాదుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.  ఇప్పటికే ఈ యాప్స్ ని ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే వాటిని మీ యొక్క ఫోన్ నుంచి అన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Also Read :   అఖిల్ కి హిట్ పడాలంటే అలా చేయాలంటున్న వేణుస్వామి..!

Advertisement

కేంద్రం తాజాగా నిషేదించిన 14 యాప్స్ లో అన్ని మెసేంజర్ యాప్స్ ఉన్నాయి. అందువల్ల మీరు కూడా ఏదైనా మెజేంజర్ యాప్ వాడుతుంటే బ్యాన్ చేసిన వాటిలో మీరు వాడే యాప్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దేశ భద్రత కారణాల రిత్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొబైల్ మెసెంజర్ యాప్స్ ద్వారా **రిస్ట్ లు మెసేజ్ ని పంపిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కూడా మెసేజ్ లను పొందుతున్నట్టు సమాచారం. 

Advertisement

Also Read :  ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి రెమ్యునరేషన్ ఎంత ? ఇప్పుడు అంతనా ?

Manam News

ఈ మొబైల్ మెసెంజర్ యాప్‌లను ఉపయోగించి **వాదులు సందేశాలను పంపడానికి, పాకిస్తాన్ నుండి సందేశాలను స్వీకరించడానికి ఉపయోగించినట్లు కేంద్ర ప్రభుత్వ అనుమానంతో  Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi, Threema బ్యాన్ చేసిన యాప్స్ లో  ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. భద్రత, నిఘావర్గాల అభ్యర్థన మేరకు ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69 ఏ ప్రకారం.. ఈ నిషేదం అమలు చేస్తున్నట్టు తెలిపింది. భారత్ లో ఈ యాప్స్ ప్రతినిధులు ఎవ్వరూ లేరని నిర్థారించుకుంది. ముఖ్యంగా మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలను కోరింది. 

Also Read :   200 స్ట్రైక్ రేట్‌తో ఫస్ట్ సెంచరీ..స్పెషల్ మ్యాచ్ లో స్పెషల్ ఇన్నింగ్..!

Visitors Are Also Reading