తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి హీరోలలో నటుడు శివాజీ కూడా ఒకరు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈయన ఇప్పటితరం ప్రేక్షకులకు అంత పెద్దగా తెలియకపోవచ్చు. కానీ శివాజీ సైతం అప్పుడప్పుడు చేసే విమర్శలు కాస్త ఘాటుగా ఉంటాయని చెప్పకనే చెప్పొచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు విభజన చెందిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిలేదని శివాజీ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మానసికంగా చనిపోయారంటూ కూడా కామెంట్ చేసారు.
Also Read : ఆ వ్యక్తి వల్లే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ సర్వ నాశనం అయిందా ?
Advertisement
రాజకీయ నాయకులు ప్రతిదానికి కూడా బానిసత్వాలు చేస్తుంటారని తన అభిప్రాయంగా తెలిపారు. కులం అనేది సమాజాన్ని పద్ధతిగా పెట్టడం కోసమే అంటూ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన సమయంలో కుల వ్యవస్థ అస్సలు లేదని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో ఉండే నటుడు పోసాని కృష్ణ మురళి లాంటి పెద్ద వాళ్ల గురించి నేను అస్సలు మాట్లాడను అని కామెంట్లు చేశారు.
Advertisement
Also Read : రాత్రి మిగిలిపోయిన రోటి తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?
ముఖ్యంగా తను ఎవ్వరో కూడా తనకు తెలియదని పోసాని పేర్కొనడంతో తను కూడా ఎవరో నాకు తెలియదంటూ చెప్పుకొచ్చారు నటుడు శివాజీ. దివంగత మాజీ సీఎం రాజ శేఖర్ రెడ్డి అవార్డు కూడా ఇచ్చారని శివాజీ తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా నంది అవార్డు వచ్చిందని.. అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టు తెలిపారు శివాజీ. ప్రజలు అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నానని, మంచి ఏదో చెడు ఏదో ప్రజలే తెలుసుకోవాలని తెలిపారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటివరకు తాను ఏ సినిమాలో నటిస్తున్నాడనే విషయాన్ని తెలియజేశాడు.