ఏపీ రాజకీయాలపై గోనె ప్రకాష్..సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయని.. విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని తేల్చి చెప్పారు. ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లు.. మరే రాష్ట్రంలోనూ లేవు… సంక్షేమం ఎన్టీఆరుతోనే మొదలైందన్నారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారని.. ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పొడా..? అని ప్రశ్నించారు.
read also : దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement
సంక్షేమం నిధులు జగన్ తన జేబుల్లో నుంచి ఇస్తున్నారా..? షర్మిళ పోలీసులను కొట్టారని నేనో వీడియోలో చూశానన్నారు. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు… షర్మిళ నా కూతురు లెక్క.. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడనని వెల్లడించారు. షర్మిళ రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా..? ఆమె పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అని నిలదీశారు.
Advertisement
READ ALSO : దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?
జగన్ షర్మిళను చిత్రహింసలు పెడుతున్నారు… ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిళను కలిశారు.. ఆమెకు సాయం కింద రూ. 5 కోట్లు ఇస్తామన్నారన్నారు. ఆ ఎంపీ షర్మిళ వద్దకు వెళ్లిన విషయం తెలుసుకుని స్వయంగాపర సీఎం జగన్ ఆయనకు ఫోన్ చేశారు… ఎందుకెళ్లావ్..? సాయం చేయాల్సిన అవసరమేంటని సీఎం జగన్.. ఆ ఎంపీని బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిళ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారు… జగన్ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్నా షర్మిళ మీద ఎందుకంత కోపం..? అని అగ్రహించారు గోనె ప్రకాష్.
READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?