హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోలకు జోడి కట్టింది. జూనియర్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు జోడి కట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్ట్ తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది. ఇది ఇలా ఉండగా, కొన్ని రోజులుగా త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
READ ALSO : మైత్రీ మూవీస్ లో బాలినేని పెట్టుబడులు ?
Advertisement
త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ఈ భామ బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంది. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య దూరం పెరిగే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడానికి ప్రముఖ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమట. త్రిష తన ఎంగేజ్మెంట్ కి తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలకు ఆహ్వానం పంపించింది.
Advertisement
READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?
అందులో భాగంగానే ధనుష్ ని కూడా త్రిష ఆహ్వానించింది. కానీ ధనుష్ వారి ఎంగేజ్మెంట్ కి రావడం త్రిషకి కాబోయే భర్త వరుణ్ కి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే ధనుష్ తో వరుణ్ కి ఓ విషయంలో గొడవ జరిగింది. తనతో గొడవ పడిన వ్యక్తిని ఎలా పిలిచావని త్రిషకు కాబోయే భర్త ఆమెను నిలదీశాడు. ఇక ఈ విషయంలోనే వారిద్దరికీ గొడవ అయిందని, అందుకే త్రిషకు పెళ్లి పై విరక్తి వచ్చిందని, ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు.
READ ALSO : దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?