మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అన్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా..పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి అని చురకలు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.
Advertisement
Advertisement
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్లా..వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానన్నారు. వైజాగ్ లో మా కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయటం సరికాదు..ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. మైత్రీ మూవీస్ లో కానీ, వైజాగ్ భూకబ్జా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్దం అన్నారు.
మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే పెడుతున్నారో అందరికీ తెలుసు..ప్రజల్లో ఆదరణ ఉందని బురద చల్లాలని చూస్తున్నారన్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ విషయంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి..సంబంధం లేకుండా అభియోగాలు చేస్తున్నారు..నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు.