తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో గుర్తింపు సాధించాడు శరత్ బాబు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించాడు. తెలుగుతోపాటు తమిళ్,కన్నడ పరిశ్రమలో కూడా ఆయానకు మంచి పేరు ఉంది. సుమారు 2000 పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు, ఏ క్యారెక్టర్ చేసిన అందులో లీనమై నటించేవాడు. 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాల వలసలో ఆయన జన్మించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ. 1973లో రామరాజ్యం అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత కన్నడ మూవీలో నటించారు.
also read:రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఆ హీరో కారణమయ్యాడా ?
Advertisement
Advertisement
దీని తర్వాత సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో పంతులమ్మ మూవీ చేశాడు. ఆ తర్వాత అమెరికా అమ్మాయి సినిమాలో నటించి ఈ సినిమా తర్వాత బాలచంద్ర డైరెక్షన్ లో చిలకమ్మా చెప్పింది సినిమాలు చేశాడు. 1981 నుంచి 1983 వరకు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. సీతాకోకచిలుక, నీరాజనం, ఓ భార్య కథ వంటి సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి. తన సినిమా కెరియర్ ఫిక్స్ లో ఉండగానే తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దదైన రమా ప్రభాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
also read:ప్రభాస్ సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. అసలు కథ అదేనా ?
సుమారు 14 సంవత్సరాల పాటు వీరి వైవాహిక బంధం బాగానే ఉంది ఆ తర్వాత వివాదాలతో విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత శరత్ బాబుపై రమాప్రభ పలు సీరియస్ కామెంట్స్ చేసింది. తాను ఆశ్రయం కోసం పెళ్లి చేసుకుంటే, తాను అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయంపై శరత్ బాబు మాట్లాడుతూ ఆమెకు 60 కోట్లు ఇచ్చి విడాకులు తీసుకున్నానని తెలియజేశాడు.
also read: