కరోనా మహమ్మారి ఎంట్రీతో మానవజీవన విధానంలో ఎన్నోమార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. వర్క్ ఫ్రమ్ హోం అంటే ఇంటివద్ద నుండే పని చేయడం. కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో కంప్యూటర్ సహాయంతో పనిచేసే సాఫ్ట్ వేర్ మరియు ఇతర ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ను ప్రకటించాయి. అయితే వర్క్ ఫ్రమ్ ప్రకటించిన తరవాత ట్రావెలింగ్ సమయం తగ్గడం మరియు ప్రొడక్టివిటీ పెరగటం జరింగింది. దాంతో కంపెనీకు లాభం జరిగింది. అయితే ఆ తరవాత కొన్ని కంపెనీలు జీవితాంతం వర్క్ ఫ్రమ్ ప్రకటించాయి.
Advertisement
Advertisement
ఆ కంపెనీలు ఏవో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. కాలిఫోర్నియాలో ఉన్న స్లేక్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ అందులో పనిచేసే ఉద్యోగులకు జీవితాంతం వర్క్ ఫ్రమ్ హోం ను ప్రకటించింది. సోషల్ మీడియ దిగ్గజం ట్విట్టర్ కరోనా ఎంట్రీ ఇచ్చిన వెంటనే వర్క్ ఫ్రం హోం ను ప్రకటించింది. అయితే ఆఫీస్ లో కచ్చితంగా ఉండాల్సిన ఉద్యోగులకు జీవితాంతం వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించకుండా మిగతా ఉద్యోగులకు ట్విట్టర్ వర్క్ ఫ్రమ్ హోం ను ప్రకటించింది.
ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పోటిఫై కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ను ప్రకటించింది. ఫిబ్రవరి లో తమ ఉద్యోగులకు జీవితాంతం వర్క్ ఫ్రమ్ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. టాటా స్టీల్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. మెటా ఫేస్ బుక్ కు సంబంధించిన మెటా కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ను ప్రకటించింది. అదే విధంగా షాపిఫై కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ను జీవితాంతం ప్రకటించింది.