Home » సీఎం కేసీఆర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ? ఎక్కువ అతనివేనా?

సీఎం కేసీఆర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ? ఎక్కువ అతనివేనా?

by Anji
Ad

దేశంలో ఉన్నటువంటి 30 మంది ముఖ్యమంత్రుల్లో  అందరి కంటే ధనిక ముఖ్యమంత్రిగా పస్ట్ స్థానంలో నిలిచారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన ప్రకారం.. సీఎం ఆస్తులను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో జగన్ ఆస్తులు రూ.510 కోట్లు ఉన్నట్టు వెల్లడి అయింది. దేశంలో అతి తక్కువ ఆస్తులు  కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిలిచారు. కేవలం రూ.15లక్షలు మాత్రమే ఆస్తులను కలిగి ఉండటం విశేషం.  

Also Read :  20వ ఓవర్ లో అత్యధిక సిక్సులు కొట్టిన లిస్టులో అగ్రస్థానం మనోడిదే..!

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ.8 కోట్లు ఉన్నట్టు నివేదికలో వెల్లడి అయింది.  మొత్తం ఆస్తుల్లో జగన్ తరువాత స్థానంలో రూ.163 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో, రూ.63 కోట్లతో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ నివేదికలో మమతా బెనర్జీ తప్పితే అందరూ ముఖ్యమంత్రుల ఆస్తులు కోటికి పైగానే ఉన్నాయి. కోటి విలువైన ఆస్తులతో హర్యానాకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కేరళ సీఎం పినరయి విజయన్ లు మమతా బెనర్జీతో కలిసి చివరి మూడు స్థానాలను పంచుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్తులు రూ.4కోట్లు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆస్తులు రూ.3కోట్లుగా నివేదిక వెల్లడించింది. మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో ముగ్గురిపై క్రిమినల్ కేసులున్నాయి. సీఎంలలో 11 మంది గ్రాడ్యుయేట్లు 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు నలుగురు ప్రొఫెషనల్ డిగ్రీలు, ఒకరు డాక్టర్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఒకరు  కేవలం 10 పాస్ కాగా.. మిగిలిన ముగ్గురు కేవలం 12వ తరగతి ఉత్తీర్ణులున్నారు. 

Also Read :  Ambedkar Statue: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి ఎవరికి తెలియని నిజాలు.. ఏంటంటే..?

Visitors Are Also Reading