కథ కాన్సెప్ట్ బాగుండాలి కానీ ఆ సినిమాను ఏ విధంగా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు.. కథ కాన్సెప్ట్ బాగా లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎన్ని ప్రమోషన్స్ నిర్వహించినా సినిమా చూడ్డానికి ఎవరూ వెళ్లరు. వెళ్లిన నిరాశపడతారు.. కథ నచ్చితే సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ప్రత్యేకమైన ఉదాహరణ బలగం మూవీ.. పూర్వకాలంలో సినిమాకి వెళ్లడానికి ఊరు ఊరంతా కలిసి వెళ్లేవారు అని దానికి నిదర్శనం ఈ బలగం.. పల్లెటూరి చావు, సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వేణు.
also read:Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?
Advertisement
సినిమా విడుదలైనప్పటి నుంచే పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయింది. రూ.1.50 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ మూవీ దాదాపుగా 30 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు తిరగరాసింది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా వేణుకు ఎనలేని గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా చేశారు. దిల్ రాజ్ మూవీ బ్యానర్ నుండి వచ్చిన ఈ మూవీ ఓటీటి లో కూడా సంచలనం సృష్టిస్తోంది. అలాంటి ఈ సినిమా గురించి దర్శకుడు వేణు సంచలన కామెంట్స్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు..
Advertisement
also read:సీఎం కేసీఆర్ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?
నేనే హీరోగా చేద్దామని బలగం కథను రాసుకున్నానని చెప్పుకొచ్చారు.. కానీ కాస్త గుర్తింపు ఉన్నటువంటి నటుడిని పెట్టాలని నిర్మాత శివశంకర్ అనడంతో చాలా బాధనిపించింది అని తెలియజేశారు. నా కోసమే రాసుకున్న కథ, నన్ను వద్దంటారేంటి అని అనుకున్నాను. దాని తర్వాత కాంప్రమైజ్ అయి నాలోని దర్శకున్ని ఎందుకు చూపించకూడదని ఈ సినిమాకు డైరెక్షన్ చేశానని తెలియజేశారు. ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్ ఈ సినిమా హీరో హీరోయిన్ తో హిట్టు కాలేదని కేవలం కథనే హీరో అని, ఇందులో ఎవరు హీరోగా చేసినా సినిమా ఈ విధంగానే ఉండేదని కామెంట్లు పెడుతున్నారు.
also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వాదనల జోలికి అస్సలు పోకూడదు