సమరసింహారెడ్డి వంటి ఓ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ తో కూడా బలంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బాలకృష్ణకి అక్కాచెల్లెళ్ళుగా నటించిన ముగ్గురు అమ్మాయిలలో దివ్యాంగురాలు పాత్రలో నటించిన సరస్వతి మీకు గుర్తుందా…? రైల్వే ట్రాక్ లో బాలయ్య పరుగెత్తలేక ఇబ్బంది పడుతుంటే బాలయ్యని మోటివేట్ చేయడంతో ఆమె కాలు తిరిగివస్తుంది.
READ ALSO : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?
Advertisement
ఇక ఈ సీన్ సమరసింహారెడ్డి చిత్రానికే ఓ హైలైట్ పాయింట్ గా నిలిచింది. సరస్వతి పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టరు. ఎందుకంటే గుర్తుపట్టరాని విధంగా తయారు అయింది. వాస్తవానికి ఆమె పేరు సహస్ర. ఈ సినిమా తర్వాత చదువుపై శ్రద్ధపెట్టిన సహస్ర నేడు గొప్ప బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతోంది. అయితే ఈమె చాలాకాలం తర్వాత ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని ఆసక్తి విషయాలు పంచుకుంది.
Advertisement
READ ALSO : ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి
ఆమె మాట్లాడుతూ చిన్నప్పుడు నేను చాలా ముద్దుగా ఉండడంతో అందరూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. చిరంజీవి గారితో రౌడీ అల్లుడు సినిమా చేస్తున్న సమయంలో నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రామ్ చరణ్ కి ఎంతో ఇష్టమైన టెడ్డీ బీర్ తో ఆడుకుంటూ ఉండే దానిని. రామ్ చరణ్ కూడా నాకు చిన్నప్పుడు మంచి స్నేహితుడు. ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండే. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాము అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది సహస్ర.
READ ALSO : Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?