ప్రస్తుతం వాస్తు శాస్త్రంతో పాటూ న్యూమరాలజీని కూడా చాలా మంది విశ్వసిస్తున్నారు. న్యూమరాలజీ ద్వారా అదృష్టం వచ్చే తేదీలను కూడా గుర్తించవచ్చు. ఆ తేదీలో ప్రాపర్టీలు కొనుగోలు చేసినా లేదంటే వస్తువులు కొనుగోలు చేసినా తిరుగు ఉండదు. ఇక కొత్త ఏడాదిలో ఇల్లు కట్టుకోవాలని..ప్రాపర్టీలు కొనుగోలు చేయాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి వారు న్యూమరాలజీ ప్రకారంగా అదృష్టమైన తేదీలలో కొనుగోలు చేస్తే లాభాలు పొందుతారు. న్యూమరాలజీ ప్రకారంగా 2022 అంటే లక్కీ నెంబర్ 6 వస్తుంది. 6 నెంబర్ పై శుక్రుడి అనుకూల ప్రభావం ఉంటుంది. శుక్రుడి అనుకూల ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యేడాది రియల్ ఎస్టేట్ బూమ్ ఉంటుంది. అంతే కాకుండా ఈ యేడాదిలో కొన్ని తేదీల్లో ప్రాపర్టీలు కొంటే అదృష్టం వరించినట్టే. ఆ తేదీలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Advertisement
జనవరిలో ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు 14,20,21,27 తేదీలలో కొనుగోలు చేస్తే మంచిది. ఫ్రిబ్రవరిలో అయితే 3,4,11,17,18 తేదీలలో కొనుగోలు చేయాలి. అదేవిధంగా మార్చి నెలలో అయితే 3,4,10,11,17,24,25 తేదీలలో కొనుగోలు చేయాలి. ఒకవేళ గనక మీరు ఎప్రిల్ లో ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని అనుకుంటే 1,7,8,21,22,28 తేదీలలో కొనుగోలు చేయడం మంచింది. మే నెలలో ప్రాపర్టీలు కొనుగోలు చేయాలనుకునేవారు 6,19,26 తేదీలలో కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయి.
Advertisement
also read : ఇంట్లో గడియారం ఎక్కడ ఉండాలి..?..అక్కడ మాత్రం అస్సలు పెట్టకూడదట..!
జూన్ లో ఆస్తులు కొనాలనుకునేవారు 2,3,16,30 తేదీలలో కొనుగోలు చేయడం ద్వారా లాభాలను పొందవచ్చు. జూలైలో అయితే 16,29 తేదీల్లో కొనుగోలు చేయాలి. ఆగస్టులో కొనాలనుకునేవారు 5,25,26 తేదీలలో ఆస్తులను కొనుగోలు చేయడం మంచిది. ఇక సెప్టెంబర్ లో ప్రాపర్టీలు కొనాలని అనుకునేవారు 1,2,22,23,29,30 తేదీలలో కొనుగోలు చేసుకోవాలి. నవంబర్ నెలలో ప్రాపర్టీలు కొనుకున్నేవారు 3,4,11,17,18,24,25 తేదీలలో కొనుగోలు చేయాలి.డిసెంబర్ లో అయితే 1,8,9,23,29 తేదీలలో కొనుగోలు చేయవచ్చు.