Home » పుష్ప 2 తరువాత ఆ స్టార్ దర్శకుడితోనేనా బన్నీ సినిమా ?

పుష్ప 2 తరువాత ఆ స్టార్ దర్శకుడితోనేనా బన్నీ సినిమా ?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ తరువాత చేయబోయే సినిమా ఏమిటి అనే దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురగదాస్ తో ఐకాన్ స్టార్ ఓ సినిమా చేయబోతున్న ప్రచారం జరుగుతోంది.

Also Read :  ఇన్ స్ట్రాగ్రామ్ లోకి దళపతి విజయ్.. గంటలోనే ఫాలోవర్స్ ఎంతమంది అంటే? 

Advertisement

కానీ అధికారంగా మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురగదాస్ ఈ విషయంపై స్పందించారు. “ఒక దర్శుడు చాలా మంది హీరోలతో చర్చలు జరుపుతుంటారు. అదేవిధంగా హీరోలు కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ల గురించి ఇప్పుడే ప్రకటించలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే తప్పకుండా చెబుతాను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురగదాస్.

Advertisement

Also Read :  నాగచైతన్య-శోభిత గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన సమంత..!

murugadoss latest comments on movie with Allu Arjun

వాస్తవానికి అల్లు అర్జున్, మురగదాస్  కాంబో గురించి చాలా కాలం చర్చ కొనసాగుతుంది. కానీ అధికారికంగా మాత్రం అనౌన్స్ మెంట్ రావడం లేదు. ఈ కాంబోలో సెట్ కావాలని బన్నీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మురగదాస్ ప్రతీ చిత్రాన్ని వైవిద్యమైన కథాంశంతో, అద్భుతమైన సందేశంతో తెరకెక్కిస్తారు. తాజాగా చాలా కాలంగా వస్తున్న వార్తలపై స్పందించారు మురగదాస్. 

Also Read :  రాంచరణ్ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారా ? సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాసన!

Visitors Are Also Reading