సాధారణంగా చాలా మంది సినిమా హీరోలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమా అప్టేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. ప్రధానంగా హీరోయిన్స్ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. హీరోలు అంత యాక్టివ్ గా ఉండకపోయినా సినిమా అప్టేడ్స్ తో ఆకట్టుకుంటారు. అయితే చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించరు.
Also Read : అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన..!
Advertisement
కొంత మంది హీరోలకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. ఆ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఉన్నారు. దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంత కాదు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలు అన్నీ తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. తుపాకి సినిమా దగ్గర నుంచి విజయ్ సినిమాలు అన్నీ రూ.100 కోట్ల మార్క్ ని చాలా అవలీలగా క్రాస్ అవుతున్నాయి.
తాజాగా దళపతి విజయ్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. విజయ్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. లియో సినిమాకు సంబంధించిన ఫోటో పోస్ట్ చేశారు విజయ్. ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో అప్పుడే మిలియన్ మంది ఫాలో వర్స్ వచ్చేశారు. కేవలంలో గంటలోనే 1.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు దళపతి విజయ్ ని. సంక్రాంతి పండుగకి విజయ్ వారసుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
Also Read : రాంచరణ్ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారా ? సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాసన!