Home » చింతపండే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..ఎన్ని ప్రయోజనాలంటే..?

చింతపండే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..ఎన్ని ప్రయోజనాలంటే..?

by Sravanthi
Ad

మన ఆరోగ్యం చెడిపోతుంది అంటే ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారపు అలవాట్లే ముఖ్యంగా ఉంటాయి.. వీటివల్లే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కాబట్టి పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.. అయితే మనలో చాలామంది చింతపండు అంటే చాలా చీప్ గా తీసేస్తారు.. కానీ చింతపండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా చింతపండులో అనేక పోషక పదార్థాలు ఉంటాయట.

also read:DASARA:ఎవరీ శ్రీకాంత్ ఓదెలా..ఆయన గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజాలు..!!

Advertisement

చింతపండు గుజ్జు, విత్తనాలు, చింతాకు సారాలు మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంaలో ప్రధాన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం.. చింతపండు గుజ్జును ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మౌలిక ఔషధంగా వాడతారు. ఇందులో నేచురల్ ఫైటో కెమికల్, కాంపోనెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

Advertisement

also read:జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!

చింతపండు గుజ్జులో ఉండే పాలిశాఖరైడ్ల నుంచి ఒక ప్రత్యేకమైన రసాన్ని జామ్, జల్లి, జున్ను తయారీలో ఉపయోగిస్తారు. ఈ చింతపండు గుజ్జులో టార్టారిక్ ఆమ్లం, జిలోజ్, గ్లూకోస్, గెలాక్టోస్, గ్లైకోసైడ్లు సమ్మేళనలు కూడా ఉంటాయి. వీటితోపాటు కాపర్, ఐరన్, మాంగనీస్,సోడియం, మెగ్నీషియం వంటి మూలకాలు కూడా ఉంటాయట. ఈ పోషక పదార్థాల వల్ల ఎముకలు బలంగా ఉండడమే కాకుండా ఎముకల పగుళ్ల ను కూడా నివారిస్తుందట.

also read:

Visitors Are Also Reading