Home » ఈ 5 చిత్రాలు మిక్స్ చేసి దసరా తీశాడా? డైరెక్టర్ మామూలోడు కాదండోయ్..!!

ఈ 5 చిత్రాలు మిక్స్ చేసి దసరా తీశాడా? డైరెక్టర్ మామూలోడు కాదండోయ్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఏ థియేటర్లో చూసిన దసరా మూవీ హవా నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా మూవీలో నాని హీరో కీర్తి సురేష్ హీరోయిన్ గా సముద్ర ఖని, సాయి కుమార్, నటి పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.. అలాంటి ఈ చిత్రం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

also read:డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి ల‌వ్ స్టోరీకి అడ్డుప‌డిన దిల్ రాజు…ఎందుకో తెలుసా.?

Advertisement

సుకుమార్ శిష్యుడిగా డైరెక్టర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు. అయితే ఈ సినిమా చూసిన కొంత మంది మాత్రం శ్రీకాంత్ సుకుమార్ తీసిన ఐదు సినిమాలపై ఆధారపడి ఈ చిత్రాన్ని తీశారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప, రంగస్థలం,ఆర్య 2 సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని దసరా సినిమాను తీసారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కి కాంతారా సినిమా ఒక విధంగా స్పూర్తి అని చెప్పవచ్చు.

Advertisement

also read:దాస్ కా ధమ్కీని ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం వెనుక దాగి ఉన్న కథ అదేనా ?

కాంతారా క్లైమాక్స్ ల ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేయాలని భావించి కథనాన్ని ఆ విధంగా సిద్ధం చేసి ఉండవచ్చని అభిప్రాయాలు వస్తున్నాయి. దసరా చిత్రంలోని టెంప్లేట్ విషయానికి వస్తే కోలీవుడ్ మూవీ మద్రాసును గుర్తు చేస్తుంది. ఈ ఐదు చిత్రాలను మిక్స్ చేసి దసరా సినిమా తీశారని కామెంట్లు వస్తున్నాయి. అయితే దసరా మూవీ ఇప్పటివరకు ఇండియా మొత్తంలో నెట్ కలెక్షన్స్ 28 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ 33 కోట్లు, ఓవర్సీస్ లో గ్రాస్ మొత్తం 12.25కోట్లు, ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ 45.30 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది.

also read:నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం

Visitors Are Also Reading