Home » TS EAMCET 2023 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… మారిన ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు… కొత్త డేట్స్ ఇవే!

TS EAMCET 2023 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… మారిన ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు… కొత్త డేట్స్ ఇవే!

by Bunty
Ad

తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

READ ALSO : Hyderabad : సౌదీ రాజు గిఫ్ట్ గా ఇచ్చిన చీతా గుండెపోటుతో మృతి..!

Advertisement

Advertisement

మే 7న నీట్ పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ల షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యధాతధంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4 తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే రెండు వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

READ ALSO :  కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇంకోవైపు తెలంగాణ ఎంసెట్ గురువారం సాయంత్రం వరకు 1,14,989 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ కు 65,033 మంది రెండింటికి 218 మంది విద్యార్థులు చొప్పున మొత్తంగా 1,80,240 మంది దరఖాస్తు చేసుకున్నారు.

READ ALSO :  మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

Visitors Are Also Reading