నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న హీరోలలో ఇతనొకరు. నాని హీరోగా నటించిన తాజా మూవీ దసరా. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ మొదలైంది. గోదావరి ఖని సమీపంలో ఉన్నటువంటి వీరపల్లి అనే కల్పిత గ్రామంలో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కింది. నానికి జోడీగా కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ సినిమాలో నటించడంతో ఎక్స్ ట్రా మైలేజ్ ఇచ్చినట్టయింది.
Advertisement
దీంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఊహించని రీతిలో నాని నటించిన దసరా చిత్రానికి కలెక్షన్లు రావడం ఇప్పుడు సెన్షేషన్ గా మారింది. నైజాం – రూ.6.78 కోట్లు, సీడెడ్ – రూ. 2.36 కోట్లు, ఉత్తరాంధ్ర – రూ. 1.42 కోట్లు , ఈస్ట్ – రూ.90 లక్షలు, వెస్ట్ – రూ.55 లక్షలు, గుంటూరు – రూ.1.22 కోట్లు, కృష్ణా- రూ.64లక్షలు, నెల్లూరు – రూ. 35 లక్షలు, మొత్తానికి చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.14.22 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. గ్రాస్ లెక్కలలో చూసినట్టయితే ఈ కలెక్షన్లు దాదాపు రూ.24.85 కోట్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.25 కోట్లు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిసి రూ.1.52 కోట్లు వచ్చాయి.
Advertisement
Also Read : ‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!
మిగిలిన భాషల్లో రూ.71 లక్షలు వచ్చాయి. నార్త్ ఇండియాలో రూ.55 లక్షలు వచ్చాయి. ఓవర్ సీస్ లో రూ.4.10 కోట్లు.. మొత్తానికి చూసినట్టయితే.. రూ.21.10 కోట్లు షేర్ రాగా.. గ్రాస్ ప్రకారం చూసినట్టయితే.. 38.65 కోట్లు అని సమాచారం. నాని సినీ కెరీర్ లోనే అతి ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా దసరా నిలిచింది. ధసరా చిత్రం కోసం ఏకంగా 22 ఎకరాలలో నిర్మాత చెరుకూరి సుధార్ భారీ సెట్ వేశారట. దాదాపు సినిమా 90 శాతం చిత్రీకరణ ఈ సెట్స్ లోనే జరిగిందట. విడుదలకు ముందు ట్రైలర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా తాజాగా వసూళ్లను రాబడుతుండటంతో నాని అభిమానులు సంబురపడుతున్నారు.
Also Read : ఏప్రిల్ 01ని ఫూల్స్ డే గా ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా ?