Home » ఏప్రిల్ 01ని ఫూల్స్ డే గా ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా ?

ఏప్రిల్ 01ని ఫూల్స్ డే గా ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా ?

by Anji
Ad

ఏప్రిల్ 01 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ తేదీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ ఫూడ్స్ డే అని పిలుస్తుంటారు. ఇక ఈ రోజును తమ సన్నిహితులు, మిత్రులను ఏదో ఒక విషయంలో ఫూల్స్ ని చేస్తూ సరదాగా గడుపుతుంటారు. చిన్న పిల్లలయితే ఎక్కువగా అల్లరి చేస్తారు. చిన్నప్పుడు మీరు కూడా ఏప్రిల్ 01వ తేదీన ఫూల్స్ చేసి ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఏప్రిల్ 01వ తేదీన ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  మ‌రోసారి ట్రోల‌ర్స్ కు అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్…!

Advertisement

1582లో జూలియన్ క్యాలెండర్ కి ఎండ్ చెబుతూ గ్రెగోరియన్ క్యాలెండర్ ని అమలులోకి తీసుకొచ్చింది ఫ్రాన్స్. పోప్ గ్రెగోరి XIII గ్రెగొరియన్ క్యాలెండర్ ను ప్రారంభించాడు. ఈ క్యాలెండర్ లో నూతన సంవత్సరం జనవరి నెల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ప్రపంచ వ్యాప్తంగా దీనినే ఉపయోగిస్తున్నాం. అంతకు ముందు జూలియన్ క్యాలెండర్ లో కొత్త సంవత్సరం ఏప్రిల్ 01న ప్రారంభం అవుతుంది. పోప్ చార్లెస్ 9 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టగా.. ప్రజలు మాత్రం ఆ మార్పు గుర్తించలేదు. ఎప్పటి మాదిరిగానే నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 01న జరుపుకోవడం ప్రారంభించారు. ఇలా ఏప్రిల్ 01న కొత్త సంవత్సరం అని జరుపుకునే వారిని ఫూల్స్ గా పిలవడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఏప్రిల్ 01ను ఫూల్స్ డే గా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

Advertisement

Also Read :   రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు చేయకూడని పనులు ఇవే..!

ఏప్రిల్ ఫూల్స్ డే విషయంలో ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II కి సంబంధించి తమాషా ఉదంతం ఒకటి ప్రబలంగా ఉండేది. రిచర్డ్ II, బొహేమియా రాణి అన్నే మార్చి 32, 1381న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ వార్త విన్నటువంటి ప్రజలు చాలా సంతోషించారు. సంబురాలు కూడా జరుపుకున్నారు. వీరి నిశ్చితార్థం కోసం సిబ్బంది అన్ని సన్నాహాలు చేయడం కూడా ప్రారంభించారు. అయితే మార్చి 31 వచ్చిన తరువాత అసలు విషయాన్ని గ్రహించాడు రిచర్డ్ II. తాను మోసపోయినట్టు గ్రహించాడు. మార్చి 32 ఎప్పటికీ రాదు కదా అనుకొని.. అప్పటి నుంచి మార్చి 31 మరుసటి రోజు ఏప్రిల్ 01న ఫూల్స్ డే జరుపుకుంటున్నారు. 

Also Read :  జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ని చేసిన మంచు విష్ణు…అదంతా రియాలిటీ షో అంటూ వీడియో రిలీజ్..!

Visitors Are Also Reading