కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు ఓ శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్ నెస్ అలవెన్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరువు బత్యాన్ని 38 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది.
Also Read : దిల్ రాజు పొలికల్ ఎంట్రీ ఏ పార్టీ నుంచో తెలుసా ?
Advertisement
ప్రతి ఏడాది మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచుతుంది. దీని ద్వారా వారు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తరువాత కోటి మందికి పైగా.. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. ఉద్యోగులు, పింఛన్ దారులకు డియర్ నెస్ అలవెన్స్ అనేది లేబర్ బ్యూరో జారీ చేసిన ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించబడుతుంది.
Advertisement
Also Read : పాక్ లోనే ఆసియా కప్ – 2023 టోర్నీ… షాక్ లో ఇండియన్స్?
ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్, పింఛన్ దారుల డియర్ నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం జనవరి 01, 2023 నుంచి వర్తించే విధంగా పరిగణించబడుతుంది. ఉద్యోగులు, పింఛన్ దారులకు డియర్ నెస్ అలవెన్స్ డియర్ నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం తరువాత ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,815.60 కోట్ల భారం పడనుంది. ఇక ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డియర్ నెస్ అలవెన్స్ పెంపు కారణంగా కేంద్ర ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఉంటుంది.
Also Read : రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం..!