Home » రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం..!

రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం..!

by Anji
Ad

ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ ఈ సారి ఐపీఎల్ కి దూరమయ్యాడు. ప్రస్తుతం అతను గాయాల నుంచి కోలుకుంటున్నాడు. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం విధితమే. 

Also Read :  పాక్ లోనే ఆసియా కప్ – 2023 టోర్నీ… షాక్ లో ఇండియన్స్?

Advertisement

రోడ్డు ప్రమాదంతో ఆటకు దూరమైనటువంటి రిషబ్ పంత్ కి అరుదైన గౌవరం ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. పంత్ జెర్సీ నెంబర్ (17)తో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధృవీకరించాడు. తమ జట్టు రిషబ్ పంత్ ను ఎంతో మిస్ అవుతుందని చెప్పాడు పాంటింగ్. అతని జెర్సీ నెంబర్ ను మా టీషర్టలపై లేదా క్యాప్ లపై ముద్రించుకోవాలనుకుంటున్నామని తెలిపాడు. ప్రతీ మ్యాచ్ కి డగౌట్ లో తన పక్కన కూర్చొవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. 

Advertisement

Also Read :   IPL 2023 : టైటిల్ రేసులో నాలుగు జట్లు… వీటిలో ఒక జట్టుకే కప్పు గెలిచే ఛాన్స్…ఏవంటే?

Manam News

పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని  అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. పంత్ స్థానంలో కేరళ వికెట్ కీపర్ అజారుద్దీన్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పంత్ అతను ఇంటి దగ్గరే ఉంటూ.. గాయాల నుంచి కోలుకుంటున్నాడు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడం సుమారు రెండేళ్ల వరకు ఆటకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్లో పంత్ ఆడకపోయినా డగౌట్ లో భాగం కావాలని ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ కోరుతుంది. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. అనుమతిస్తే ఢిల్లీ ఫ్రాంచైజీ మ్యాచ్ లకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read :  దిల్ రాజు పొలికల్ ఎంట్రీ ఏ పార్టీ నుంచో తెలుసా ? 

Visitors Are Also Reading