Home » దిల్ రాజు పొలికల్ ఎంట్రీ ఏ పార్టీ నుంచో తెలుసా ? 

దిల్ రాజు పొలికల్ ఎంట్రీ ఏ పార్టీ నుంచో తెలుసా ? 

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నిర్మాతల్లో ఆయన మొదటి వరుసలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు దిల్ రాజు. మరోవైపు చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో దిల్ రాజుకు శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. వివాదాలు ఆయనకు కొత్త ఏమి కాదు. తన విజయాలను తట్టుకోలేని వారు తనపై బురద జల్లుతున్నారు అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు దిల్ రాజు.  

Also Read :  మంచు మనోజ్ కి అనుచరుడిగా ఉన్న సారథి ఎవరో తెలుసా ? 

Advertisement

తాజాగా దిల్ గురించి ఓ వార్త సంచలనంగా మారింది. దిల్ రాజు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని.. మరి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. ఇటీవల దిల్ రాజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో వీరు కలిశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తన సొంత గ్రామం అయినటువంటి నర్సింగ్ పల్లిలో సొంత ఖర్చుతో నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయానికి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.  

Advertisement

Also Read :  Pavithra Naresh Marriage : నాలుగో పెళ్లిపై అసలు విషయం చెప్పేసిన నరేష్… ‘మళ్లీ పెళ్లి’ అంటూ పోస్టర్ రిలీజ్!

Manam News

రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారట దిల్ రాజు. దీంతో దిల్ రాజు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే బలగం సినిమాతో కేటీఆర్ నే మెప్పించిన దిల్ రాజు.. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చనువుగా ఉండటం అంతుచిక్కడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచే దిల్ రాజును పోటీ చేయించాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే మాత్రం దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ పై ప్రకటించాల్సిందే. 

Also Read :  వరల్డ్ కప్ ముందు… జల్సాల కోసం సెలవులు అవసరమా రోహిత్ : గవాస్కర్ సీరియస్

 

Visitors Are Also Reading