Actress Soundarya Family: ఆమె పేరులోనే ఉంది సౌందర్యం.. ఆమె కళ్ళలో ఉంది నటన.. అలనాటి మహానటి సావిత్రి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న ఏకైక నటి సౌందర్య.. ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా , కేవలం నటనా అభినయంతో ఎంతో పేరు తెచ్చుకుంది.. అప్పట్లో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈమె సినిమాలు వస్తున్నాయి అంటే తప్పనిసరిగా మూవీ హిట్ అయ్యేది.. అలాంటి సౌందర్య డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా వేచి చూసేవారు.. అలాంటి ఈమె కెరియర్ అర్ధాంతరంగా ముగిసింది.
Advertisement
Also read:తారకరత్న గురించి అలేఖ్య చేసిన పోస్ట్ చూస్తే బాధపడకుండా ఉండరు..!
దీనికి ప్రధాన కారణం హెలికాప్టర్ ప్రమాదం.. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.. ఇక అప్పటి నుంచి సౌందర్య గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలు వస్తూనే ఉన్నాయి.. అయితే తాజాగా ఆమె కొడుకు ఉన్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. విశేషాలు ఏంటో చూద్దాం.. సౌందర్య తన చిన్ననాటి స్నేహితులైన రఘును పెళ్లి చేసుకుంది. బంధుమిత్ర సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. 2003లో పెళ్లి జరగగా ఆ మరుసటి ఏడాది ఆమె విమాన ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలుసు. సౌందర్య కు తన భర్త రఘు అంటే చాలా ఇష్టం.
Advertisement
Also read:కృష్ణవంశీ,రమ్యకృష్ణల కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
ఆమె సంపాదించిన ఆస్తులు అన్ని అతని పేరిటే రాసింది. ఆమె మరణించిన తర్వాత ఆస్తుల విషయంలో రఘు మరియు సౌందర్య తల్లిదండ్రులకు గొడవలు జరిగాయి. ఇక కొన్నాళ్ల తర్వాత రఘు మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని గోవాలో ఉంటున్నారు. అయితే సౌందర్య చనిపోయే నాటికే ఆమెకు కొడుకు ఉన్నాడని అప్పట్లో వార్త వచ్చింది. కానీ సౌందర్య మరణించడంతో అతని బాధ్యతలు రఘు తీసుకున్నాడు అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై సౌందర్య సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆమె పెళ్లయిన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని అనుకుందని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు అంటూ బదులిచ్చారు.
Also read:ఉగాది రోజు చేయాల్సినవి చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!