విశాఖపట్టణం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. సొంత దేశంలో భారతజట్టు సాధించిన నాలుగో అత్యల్ప స్కోరు ఇది. అంతకుముందు భారత్ లో టీమిండియా మూడుసార్లు తక్కువ స్కోర్లు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఇన్నింగ్స్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : ఎంతసేపు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుందో తెలుసా ..?
భారత్ వర్సెస్ శ్రీలంక :
కాన్పూర్ వేదికగా 1986లో భారత్-శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 195 పరుగులు చేసింది. 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పుడు ఆ జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. స్వదేశంలో భారత జట్టు అత్యల్ప స్కోరు ఇదే.
భారత్ వర్సెస్ వెస్టిండిస్ :
Advertisement
1993లో అహ్మదాబాద్ లో భారత్, వెస్టిండిస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండిస్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ సమయంలో భారతజట్టు కేవలం 100 పరుగుకు ఆలౌట్ అయింది.
Also Read : ఫ్యాన్స్ కు షాక్… సూర్యకుమార్ రిటైర్మెంట్?
భారత్ వర్సెస్ శ్రీలంక :
2017లో ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక జట్టు 20.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా 2000లో షార్జా వేదికగా జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోపీ మ్యాచ్ లో భారత్ -శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఆ తరువాత సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డేలలో భారత జట్టు అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.