ముంబై లో జరిగిన తొలి వన్డే లో గెలిచిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. విశాఖపట్నం గడ్డ పైన టీమిండియాకు ఝలక్ ఇచ్చింది కంగారూ జట్టు. విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే చేదించింది.
Advertisement
read also : జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!
Advertisement
ఆసీస్ ఓపెనర్లు మిచేల్ మార్ష్(66), హెడ్(51) పరుగులతో మ్యాచ్ ను ఫినిష్ చేశారు. ఇక 11 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించిన ఆస్ట్రేలియా ఓ అరుదైన ఘనత సాధించింది. ఓవర్ల పరంగా అత్యధిక వేగంగా టార్గెట్ చేదించిన జట్టుగా ఆసీస్ నిలిచింది. అంతకు ముందు 2019లో హామిల్టన్ వేదికగా జరిగిన ఓ వన్డే మ్యాచ్ లో భారత్ పై 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో చేదించింది.
ఇప్పటివరకు ఇదే అత్యంత వేగమైన ఛేజింగ్ కాగా, తాజా మ్యాచ్ తో కివిస్ రికార్డును ఆసీస్ బేక్ చేసింది. ఇక ఓవరాల్ గా ఓవర్ల పరంగా ఆస్ట్రేలియాకు ఇది మూడో అతిపెద్ద విజయం. అంతకుముందు 2004లో యూఎస్ఏ పై 66 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే ఆసీస్ సాధించింది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది.
Advertisement
READ ALSO : TSPSC రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..