Home » పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యంలో ఆ హీరోతో క‌లిసి స‌మంత పూజలు..నెట్టింట వైరల్..!

పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యంలో ఆ హీరోతో క‌లిసి స‌మంత పూజలు..నెట్టింట వైరల్..!

by AJAY
Ad

టాలీవుడ్ అందాల తార స‌మంత కేవ‌లం ఒకే ర‌క‌మైన పాత్ర‌ల‌కు అతుక్కు పోకుండా అన్నిర‌కాల పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. విడాకుల త‌ర‌వాత స‌మంత అస్సలు గ్యాప్ తీసుకోవ‌డం లేదు. అంతే కాకుండా పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌లో న‌టిస్తోంది. విడాకుల త‌ర‌వాత పుష్ప సినిమాలో ఐటమ్ పాట‌కు డ్యాన్స్ చేసి యూట్యూబ్ ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా త‌ర‌వాత పాన్ ఇండియా లెవ‌ల్ లో గుర్తింపు రావ‌డంతో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో న‌టించే ఛాన్స్ ను దక్కించుకుంది. ఈ సిరీస్ కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఈ సిరీస్ త‌ర‌వాత స‌మంత య‌శోద సినిమాలో న‌టించ‌గా ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. కాగా ఇప్పుడు స‌మంత మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Advertisement

గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత య‌శోద సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోవ‌డంతో విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. శకుంత‌ల దుశ్యంతుల క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ సినిమా వ‌చ్చే నెల‌14న థియేట‌ర్ ల‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర యూనిట్ ప్ర‌మోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా స‌మంత చిత్ర‌యూనిట్ తో క‌లిసి పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించింది.

ALSO READ : RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading