Home » అంతర్జాతీయ క్రికెట్ లోనే మొదటి సారి.. పాక్-ఆప్గన్ సిరీస్ లో వెరైటీ రూల్..!

అంతర్జాతీయ క్రికెట్ లోనే మొదటి సారి.. పాక్-ఆప్గన్ సిరీస్ లో వెరైటీ రూల్..!

by Anji
Ad

పాకిస్తాన్ వర్సెస్ అప్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్  మార్చి 25 శనివారం నుంచి జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అప్గనిస్తాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఆడుతున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ లో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య చాలా స్నేహభావం కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు జట్లు బద్ధ శత్రువులుగా మారుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టీ-20 సిరీస్ కి ముందు మ్యాచ్ సమయంలో ఇరు జట్ల అభిమానులు ఒకే స్టాండ్ లో కాకుండా వేర్వేరు స్టాండ్ లలో కూర్చోవాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Also Read :   సెంచరీ తర్వాత కోహ్లీ ముద్దాడుతున్న ఈ లాకెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Advertisement

Advertisement

షార్జా వేదికగా టీ-20 సిరీస్ జరుగనుంది. ఇరు జట్ల అభిమానులు కూర్చునేందుకు ప్రత్యేక స్టాండ్ లు ఏర్పాటు చేసారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఆటగాళ్లే కాకుండా స్టాండ్స్ లోని అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. 2022లో జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్, అప్గనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఈ మ్యాచ్ లో తొలుత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా ఆ తరువాత స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులకు మళ్లీ గొడవకు దిగారు. 

Also Read :  21 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన సంజు శాంసన్

Manam News

బహుశా అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి రెండు జట్ల క్రీడాకారులు వేర్వేరు స్టాండ్ లలో మొదటిసారి కూర్చోనున్నారు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఉత్కంఠ నెలకొంది. ఈ సిరీస్ కి షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ జట్టుకు బాధ్యతలు చేపట్టనున్నాడు. పాకిస్తాన్ Vs అప్గనిస్తాన్ ఫస్ట్ టీ-20 షార్జా వేదికగా మార్చి 25న, రెండో టీ-20 షార్జా వేదికగా మార్చి 27న, పాకిస్తాన్ Vs అప్గనిస్తాన్ మూడో టీ-20 కూడా షార్జా వేదికగానే మార్చి 29న జరగడం విశేషం. 

Also Read :  ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ చేసి ఓడిపోయిన టాప్ 5 టీమ్ లు ఇవే..!

Visitors Are Also Reading