Home » భార‌త అతిపెద్ద థియేట‌ర్ మూసివేత‌.. స్టార్ హీరో అప్సెట్‌..?

భార‌త అతిపెద్ద థియేట‌ర్ మూసివేత‌.. స్టార్ హీరో అప్సెట్‌..?

by Bunty
Ad

సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదానికి దారి తీసింది.ఈ ఎఫెక్ట్ థియేట‌ర్ల‌పై ప‌డుతున్న‌ది. ఇప్పుడు ఏపీలో సినిమా థియేట‌ర్లు వ‌రుస‌గా మూసివేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌భుత్వం జీవో 35 తో సినిమా టికెట్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గించాల్సి వ‌చ్చింది. ఈ విషయంలో సినీ పెద్దలు స్పందించే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంది చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలకు ప్రశ్నించేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అలాగే మరికొంత మంది మాత్రమే ఆ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నారు. థియేటర్ల నిర్వ‌హ‌ణ భారంగా మారింద‌ని, ఆర్థిక ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని, థియేట‌ర్ య‌జ‌మానులు వాపోతున్నారు.

Advertisement

ఏపీలో ఉన్న‌టువంటి బాహుబ‌లి థియేట‌ర్ ఇదే బాట‌లో మూత‌ప‌డింది. నెల్లూరు జిల్లా సూళ్లురుపేట‌లో V-EPIQ మ‌ల్టిప్లెక్స్ థియేట‌ర్ మూసివేసారు. నూత‌నంగా టికెట్ విధానానికి నిర‌స‌న‌గా మ‌ల్టీప్లెక్స్ కు నిర్వాహ‌కులు తాళం వేసారు. ఇది గ్రామ‌పంచాయ‌తీలో ఉండ‌డంతో టికెట్ల రేట్లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, త‌గ్గిన టికెట్ ధ‌ర‌ల‌తో థియేట‌ర్ల‌ను న‌డుప‌లేము అని, సినిమా హాల్ కు తాళం వేసి మూసేసారు. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా V-EPIQ మ‌ల్టీ ప్లెక్స్‌కు పేరున్న‌ది. బాహుబ‌లి థియేట‌ర్‌గా దీనిని పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా ఆడుతుంది. టికెట్ రేట్ల‌ను భారీగా త‌గ్గించ‌డంతో థియేట‌ర్‌ను తాత్కాలికంగా మూసివేసిన‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన‌ది.

Advertisement

కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి థియేట‌ర్ నిర్మించిన‌ప్ప‌టికీ.. ఈ థియేట‌ర్ గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో ఉండ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన ధ‌ర‌ల‌కు సినిమా టికెట్లు అమ్మాల్సి వ‌స్తే.. న‌ష్టం వాటిల్లుతుంది. గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో ఉన్న థియేట‌ర్ల‌కు ప్రీమియం 80, డీల‌క్స్ 50, ఎకాన‌మీ 30 ఫిక్స్ చేసింది. ఆ రేట్ల‌కు టికెట్లు అమ్మ‌డం కంటే.. థియేట‌ర్ మూసివేయ‌డం వ‌ల్ల వచ్చే న‌ష్టాలు త‌క్కువ అని, యాజ‌మాన్యం భావించి.. మూసివేసిన‌ట్టు ప్ర‌క‌టించింది యాజ‌మాన్యం. మ‌రోవైపు రెండు తెలుగు రాష్ట్రాల‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. అయితే మొత్తానికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ గా గుర్తింపును అందుకున్న ఒక థియేటర్ క్లోజ్ అవ్వగా ఆ విషయంలో ప్రభాస్ అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading