సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినప్పుడల్లా వెన్నుపోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు లక్ష్మీపార్వతి. ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ “నాకు జీవితాన్ని ఇచ్చాడు” అంటూ ఎన్టీఆర్ వర్ధంతి రోజు మాట్లాడిన లక్ష్మి పార్వతి మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.
Advertisement
Advertisement
ఇక తరచూ నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడంటూ చెప్పే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కొడుకులకు ఆస్తి ఎలా ఇచ్చారనే విషయాన్ని తెలిపారు. రామారావు గారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడే పిల్లలందరికీ ఆస్తులను సమానంగా ఇచ్చి ఆయనతో ఏ ఆస్తి లేకుండా చేసుకున్నారు అంటూ లక్ష్మీ పార్వతి వివరించారు.
Also Read : చెత్తపని చేయాలంటూ బలవంతం….జబర్దస్త్ పై అనసూయ ఓపెన్ కామెంట్స్..!
ఎన్టీఆర్ గారు కొడుకులందరికీ ఇల్లు కట్టించి ఇచ్చారని ఆస్తులను సమానంగా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. “నా మీద నిందలు వేయడానికి ఆస్తుల కోసం, పదవుల కోసం ఎన్టీఆర్ గారి పక్కన చేరినట్లు నా మీద నిందలు వేస్తారు. కానీ నేను వచ్చే సమయానికి ఆయన వద్ద ఎలాంటి ఆస్తులు లేవు. ఇక పదవుల మీద నాకు వ్యామోహం ఉండి ఉంటే నేను ఎప్పుడో పదవులను తీసుకుని ఉండేదాన్ని. ఆయన ఎన్నోసార్లు అడిగారు కానీ నేను తిరస్కరించాను” అంటూ చెప్పుకొచ్చా రు లక్ష్మీపార్వతి.
Also Read : తారకరత్న ఆస్పత్రి బిల్ కట్టింది బాలయ్య కాదు..లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!