టమోటాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఇది మాత్రమే కాదు.. టమాటాలను అనేక చర్మ సంరక్షణ సౌందర్య ఉత్పత్తులతో కూడా ఉపయోగిస్తారు. టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి రోగ నిరోధక శక్తికి చాలా అవసరం. టమోటాలు ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు:
పోట్ట సమస్య: టమోటాలు ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. మీరు ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్లయితే టమోటాలు తినడం మానేయండి. దీన్ని తీసుకోవడం వల్ల పేగు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు, మీకు ఇప్పటికే మలబద్దకం ఉంటే మీరు పొరపాటున కూడా టమోటాలు తినకూడదు.
Advertisement
అలర్జీ సమస్య: టమోటాలో ఉండే హిస్టమిన్ సమ్మేళనం అలర్జీని కలిగిస్తుంది. కాబట్టి టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల దగ్గు, తుమ్ములు, గొంతుమంట, ముఖం, నాలుక వాపు వంటివి వస్తాయి. అయితే మీకు ఇప్పటికే అలర్జీ సమస్య ఉంటే, మీరు టమోటాలు తీసుకోవడం మానేయాలి.
కిడ్నీ స్టోన్ సమస్య: కాల్షియం పుష్కలంగా ఉండే టమోటాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి మీరు కూడా టమోటాను ఎక్కువగా తీసుకుంటే ఈ రోజు నుండే జాగ్రత్త పడండి. లేదంటే ప్రమాదం బారిన పడాల్సి ఉంటుంది.
read also : ఆస్తిలో తారకరత్న వాటాను ఆ ట్రస్ట్ కు రాశారా… అలేఖ్య రెడ్డికి అన్యాయమేనా?