సాధారణంగా ఒకే పేరుతో, ఒకే విధంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం చాలా అరుదైన సందర్భంలో చూస్తుంటాం. ముఖ్యంగా ఒకే పేరుతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. అటు రాజకీయపరంగా ఇటు సినిమాల పరంగా ఒకే పేరుతో కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఇక సినీ పరిశ్రమలో అయితే ఒకే పేరుతో ఏకమంది నటీనటులు ఉన్నారు. రామారావు, సత్యనారాయణ, బాలకృష్ణ, జయలలిత, నరేష్, సుధాకర్ ఇలా ఒకే పేరుతో చాలామంది నటీనటులు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆనంద్ రాజా అనే నటుడు ఉన్నారు. 1980లో ఒక రాజా ఉండేవాడు. అప్పట్లో ఈయన పేరు చెబితే అమ్మాయిలు మత్తెక్కిపోయే వాళ్ళు.
Advertisement
దాసరి నారాయణ రావు రాజాను వెండితెరకు పరిచయం చేశారు. ఇతను నటించిన ‘స్వప్న’ అనే చిత్రం అప్పట్లో యూత్ ని ఊపు ఊపేసింది. 1980లో శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో స్వప్న అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రంతోనే ‘స్వప్న’ అనే నటి హీరోయిన్ గా పరిచయమైంది. చిత్రంలో అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అనే పాట నీ దాసరి నారాయణరావు రాశారు. సంగీత దర్శకులు చల్ల పిల్ల సత్యం ఈ చిత్రానికి సంగీతం వహించగా.. దాసరి రాసిన పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. దాసరి రాసిన గీతాల్లో ఈ పాటకు ఎంతగానో పేరు వచ్చింది. ఆనాటి సినీ ప్రేమికులను ‘స్వప్న’ చిత్రం ఆకట్టుకుంది. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి చిత్రాలతో పోటీపడి మరి ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
Advertisement
Also Read : జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై లోకేష్ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!
పలు చిత్రాలలో రాజా యంగ్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. అదేవిధంగా సపోర్టింగ్ క్యారెక్టర్లలో కూడా నటించారు. అకస్మాత్తుగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రాజా బుల్లితెరవైపు మొగ్గు చూపారు. ప్రముఖ బుల్లితెర దర్శకురాలు మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ‘ఋతురాగాలు’ లో లీడ్ యాక్టర్ గా చేశాడు. దూరదర్శన్ లో ప్రసారమైంది. అకస్మాత్తుగా రాజా గుండెపోటుతో చనిపోయాడు. రాజా, ఏఎన్ఆర్ తో కలిసి దర్శకుడు వల్లభనేని జనార్ధన్ చిత్రాన్ని ప్రారంభించగా రాజా చనిపోవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినికి రాజా దగ్గర బంధువు. ఎన్టీఆర్ తల్లి శాలిని సోదరిని రాజా పెళ్లి చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి రాజా వరుసకి బాబాయ్ అవుతాడు. రాజా తెలుగుపేక్షకుల నుంచి భౌతిక దూరమైనప్పటికీ బుల్లితెరలు ఆయన నటించిన సినిమాలు అప్పుడప్పుడు ప్రసారం కావడంతో ఇంకా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోయారు.
Also Read : నేను చిరంజీవి ఫ్యాన్…నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్..!