Home » ఆ సినిమా కోచిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని తీసుకోమన్న దాసరి.. దర్శకుడు ధవళ సత్యం ఏమన్నారంటే..?

ఆ సినిమా కోచిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని తీసుకోమన్న దాసరి.. దర్శకుడు ధవళ సత్యం ఏమన్నారంటే..?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ధవళ సత్యం. ఈయన దాసరి నారాయణరావు శిష్యుడిగా ఇండస్ట్రీలో కొనసాగి.. దర్శకుడిగా మారారు. ఆ తరువాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవితో జాతర అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా విషయం దాసరి నారాయణరావు చిరంజీవిన తీసేసి హీరోగా చంద్రమోహన్ ని పెట్టామన్నారట. ఇంటర్వ్యూలో దర్శకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

 

జాతర సినిమా తెరకెక్కే సమయంలో అందరూ కొత్తవాళ్లే. నిర్మాత, దర్శకుడు, కెమెరామెన్ అందరూ కొత్తవాళ్లే. అయితే సినిమా చిరంజీవిని హీరోగా ఎంపిక చేశాను. గతంలో తన సినిమాలో హీరోగా చూపిస్తానని చిరంజీవికి మాట ఇచ్చాను. అందుకే తాను దర్శకత్వం వహించినటువంటి మొదటి సినిమాకు చిరంజీవిని హీరోగా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు ధవళ సత్యం. అయితే ఈ సినిమాలో చిరంజీవిని తీసుకోవడం అందరికీ ఇష్టమే. కానీ దర్శకుడు దాసరి  వచ్చి అందరూ కొత్తవాళ్లే కదా హీరోను చిరంజీవిని కాకుండా చంద్రమోహన్ ని తీసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారట. ఆ సమయంలో తాను మాట్లాడుతూ.. అతని మొహంలో ఏదో ఫెయిర్ ఉందని.. ఈ పాత్రకు చిరంజీవి కరెక్ట్ న్యాయం చేయగలడనే నమ్మకం ఉందని చెప్పాడు.

Advertisement

Also Read :  Jr: NTR ఇంట్లో తారకరత్న ఫోటోతో పాటు మరో హీరో ఫోటో.. ఎవరిదంటే..?

అప్పుడు దాసరి ఏంటీ నమ్మకం.. చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని పెట్టుకో అని చెప్పారట. తన గురువు అయిన దాసరి చెప్పినప్పటికీ జాతర సినిమాలో చిరంజీవిని హీరోగా తీసుకొని సినిమా చేశామని దర్శకుడు ధవళ సత్యం తెలిపారు. ఇక ఈ సినిమా రంగస్థలం సినిమా కాన్సెప్ట్ ఒకటే అని ప్రశ్నించగా.. వాస్తవం చెప్పాలంటే ఆ రెండు సినిమాలు  ఒకే కథ అని చెప్పుకొచ్చారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి నటించిన జాతర సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు ధవళ సత్యం.

Also Read :  “సార్” సినిమాలోని ఆ సీన్ తో త్రివిక్ర‌మ్ లైఫ్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading