టాలీవుడ్ లో సొంత టాలెంట్ తో ఎదిగిన స్టార్ లలో చిరంజీవి కూడా ఒకరు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా వచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం ఇండస్ట్రీనే ఏలుతున్నాడు. ఎన్టీఆర్ కృష్ణ లాంటి స్టార్స్ కు పోటీ ఇచ్చి ఆ తరవాత తరంలో చిరు నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఇక చిరంజీవి వారసత్వంగానే ఆయన తమ్మళ్లు పవన్ కల్యాణ్, నాగబాబులు సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కాగా పవన్ స్టార్ హీరో అయితే నాగబాబు నటుడుగా నిర్మాతగా మరియు బుల్లితెర జడ్జిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
Advertisement
Advertisement
ఇక చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ ఆస్తులు పెద్దగా లేకపోయినప్పటికీ అప్పటికే స్టార్ కమెడియన్ గా రానిస్తున్న అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం జరిపించారు. అంతే కాకుండా పెళ్లికి ముందు చిరంజీవి గురించి అల్లు రామలింగయ్య తో పాటూ తన కుమారుడు అల్ల అరవింద్ తోనూ ఎంక్వైరీ చేయించారు. ఆ తరవాతనే చిరంజీవికి సురేఖను ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే పెళ్లి జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
చిరంజీవి చిరిగిన చొక్కాతో వచ్చి సురేఖ మెడలో తాలికట్టారు. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరు అలా తాలి కట్టడానికి ఓ రీజన్ కూడా ఉంది. పెళ్లి సమయానికి కూడా చిరు నూతన్ ప్రసాద్ తో కలిసి ప్రేమలీలలు అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా ఆ సినిమా షూటింగ్ లో చిరంజీవి షర్ట్ చిరిగిపోయింది. దాంతో పెళ్లి ముహూర్తం ఆలస్యం అవుతుందని చిరిగిన చొక్కాతోనే వెళ్లి తాళి కట్టాడు.
Also Read: గూగుల్ కనిపించని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ పేరు.. యువరాజ్ ఏమన్నారంటే..?