Home » తెలంగాణ గురుకులాల్లో 13,000 ఉపాధ్యాయ పోస్టులు… పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ గురుకులాల్లో 13,000 ఉపాధ్యాయ పోస్టులు… పూర్తి వివరాలు ఇవే!

by Bunty

 

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 13 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2,000 లకు పైగా పోస్టులను ఆయా సొసైటీలు గుర్తించాయి. వీటిని కూడా త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా నింపేందుకు అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే గురుకులల్లో భర్తీ చేయనున్న పోస్టుల్లో 11,012 పోస్టులకు అనుమతులు లభించాయి.

 


సంబంధిత నియామక ప్రకటనలు సైతం సిద్ధమయ్యాయి. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ గురుకులాల పోస్టులను కూడా కలిపి అన్నింటికీ ఒకేసారి ప్రకటనలు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. అందుబాటులోని 11,012 పోస్టులకు నియామక ప్రకటనలు సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వల్ల వాటికి సంబంధించిన ప్రకటనలు నిలిచిపోయాయి.

కోడ్ ముగిసే సమయానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల పోస్టులకు కూడా అనుమతులు వస్తాయి. అన్ని పోస్టులను కలిపి ఒకేసారి ప్రకటనలు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. గురుకులాల ఉద్యోగ ప్రకటనల జారిలో బ్యాక్ లాగ్ నివారించేందుకు తోలుత ఉన్నత పోస్టులకు, అనంతరం కిందిస్థాయి పోస్టులకు ప్రకటనలు జారీ చేయాలనే యోచనలో ఉంది. ఆ మేరకు భర్తీ ప్రక్రియను నియామక బోర్డు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

READ ALSO : తారకరత్న మరణ వార్తను…చంద్రబాబు ఇన్నాళ్లు దాచారు – లక్ష్మీపార్వతి 

 

Visitors Are Also Reading