Home » నోటి దుర్వాసనను నివారించడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి..!

నోటి దుర్వాసనను నివారించడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి..!

by Anji

సాధారణంగా నాలుకను శుభ్రం చేయడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. చాలా రకాల బ్యాక్టీరియా మన కడుపులోకి ప్రవేశించి మనలను అనారోగ్యానికి గురి చేస్తుంది. అంతేకాదు.. నాలుకలో ఎక్కడో పేరుకుపోయిన మురికి వల్ల నోటి దుర్వాసన వస్తుంది. రోజు నాలుకను శుభ్రం చేసుకోకపోవడం చాలా అవసరం. 

ఉప్పు నీరు :

Manam News

నాలుకను శుభ్రం చేయడానికి ఉప్పు నీరు ఉపయోగించవచ్చు. దీనికోసం గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలుపుకొని నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు రెండు సార్లు గోరువెచ్చని నీటిలో ఉప్పువేసుకొని శుభ్రం చేసుకోవడం వల్ల తెల్లని పొరను తొలగిండం ప్రారంభమవుతుంది. నోటి దుర్వాసనను నివారిస్తుంది.  

Also Read :  తారకరత్నని చివరి చూపు చూసేందుకు మోహన్ బాబు రాకపోవడానికి కారణం అదేనా..?

టంగ్ క్లీనర్ తో శుభ్రం చేయండి :

నాలుకపై తెల్లని పొరను వదిలించుకోవడానికి టంగ్ క్లీనర్ ఉపయోగించడం చాలా మంచిది. నాలుకను చాలా సులభంగా శుభ్ర పరుచుతుంది. టంగ్ క్లీనర్ ని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించడం వల్ల నాలుకలోని తెల్లని పొరను తొలగించవచ్చు. 

ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోండి :

Manam News

రోజు వారి ఆహారంలో ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నాలుకపై తెల్లని పూతను నివారించవచ్చు. అంతేకాదు.. నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంలో ప్రోబయోటిక్ ఆహారాలు సహాయపడుతాయి. దీంతో నోటి దుర్వాసన రాదు. 

Also Read :  ఇన్ స్టా, ఫేస్బుక్ యూజర్లకు ఓ దిమ్మ తిరిగే షాక్.. ఇక పై ఛార్జీలు వసూలు!

కొబ్బరినూనెతో కడుక్కోవాలి :

Manam News

కొబ్బరినూనెతో పళ్లు తోముకోవడం వల్ల మీ నోటిలోని సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం 1-2 స్పూన్ల కొబ్బరినూనె కొద్దిగా వేడి చేయాలి. దీంతో పళ్లు తోముకోవాలి. కొంత సమయం తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. 

బేకింగ్ సోడా ప్రయత్నించండి :

Manam News

ముఖ సంరక్షణ కోసం బేకింగ్ సోడాను ఉపయోగించడం చాలా ప్రయోజనకరం. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని నాలుకపై అప్లై చేసి 2 నిమిషాల తరువాత నాలుకను బ్రష్ చేసి శుభ్రం చేసుకోవాలి. మీ నోరు శుభ్రంగా, దుర్వాసన లేకుండా ఉండటానికి ఈ పద్దతిని వారానికి రెండు మూడు సార్లు పాటించితే.. ఫలితముంటుంది.  

Also Read :   పిల్లల ముందు… తల్లిదండ్రులు అసలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా?

Visitors Are Also Reading