మనిషికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి రెండింటికీ ఎంతో మేలు చేస్తుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రస్తుతం తమ సౌకర్యాన్ని బట్టి నిద్రపోతున్నారు. అయినప్పటికీ ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతూనే ఉంది. అయితే ప్రస్తుత కాలంలో రాత్రి నిద్ర పట్టకపోవడానికి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్న కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం.
Advertisement
నిద్ర పట్టకపోవడానికి, కంటి నిండా నిద్ర ముంచుకొస్తున్న పడుకోకపోవడానికి ముఖ్యమైన కారణం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం. ఫోన్, లాప్టాప్, ఐపాడ్ ఇలా రకరకాల పేరుతో ఇది నిద్రను పాడు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇది అతి పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్ర రావడానికి రెండు గంటల ముందు ‘మెలటోనిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే నిద్ర రావడానికి ప్రధాన కారణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ విడుదల అనేది ఆగిపోతుంది. దీనివల్ల నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
Advertisement
అందుకే నిద్ర పోవడానికి రెండు గంటల ముందే ఫోనును దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. పడుకోవడానికి ముందు టీ, కాఫీలు మానేయాలి. ఇదే నిద్రకు ప్రధాన ఆటంకం. ఇందులో నుంచి వచ్చే కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది. శరీరం డిహైడ్రెట్ అవ్వటం వల్ల నిద్ర అనేది పట్టదు. కాబట్టి నిద్రపోవడానికి ముందు కెఫీన్, మద్యం సేవించకపోవడం ఉత్తమం. రాత్రి సమయంలో తొందరగా జీర్ణం అయ్యే కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. పడుకునే సమయంలో కళ్ళు తెరిచి ఉండటం, పగటిపూట పడుకుని ఉండడం నిద్రకు అతి పెద్ద భంగంగానే చెప్పొచ్చు.
READ ALSO : Varasudu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘వారసుడు’.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది