మనం ఎప్పుడు చూసిన నీటి, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ ఆకారంలోనే ఉంటాయి. ఆ రౌండ్ ఆకారం ఉండే ట్యాంకర్లను ట్రాక్టర్లు గానీ లారీలు గానీ ఇతర వాహనాలు గానీ తీసుకు వస్తాయి. అంతే గానీ చతురస్రం ఆకారంలో గానీ దీర్ఘ చతరస్రం ఆకారంలో గానీ ఎప్పుడు కూడా నీటి , ఆయిల్ ట్యాంకర్లు ఉండవు. రౌండ్ ఆకారం తో పాటు కొన్ని సిలిండ్రికల్ ఆకారం లోనూ ఉంటాయి. అయితే దీనికి కారణం ఎంటో ఎప్పుడైనా ఆలోచించారా. ఇప్పుడు మనం నీటి, ఆయిల్ ట్యాంకర్లు ఎందుకు రౌండ్ ఆకారంలోనే ఉంచుతారో తెలుసుకుందాం.
Advertisement
నీటి ట్యాంకర్లు గానీ ఆయిల్ ట్యాంకర్లు గానీ గుండ్రంగా ఉంటే.. ట్యాంకర్లపై ఒత్తిడి తక్కువ గా ఉంటుంది. గుండ్రం గా కాకుండా చతురస్రం, దీర్ఘ చతురస్రాకారంలో ట్యాంకర్లు ఉంటే ట్యాంకర్ల పై ఒత్తిడి ఎక్కువ గా పడుతుంది. కార్నర్స్ వద్ద ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇలా ఒత్తిడి ఉండటం వల్ల రవాణా వేగంగా జరగదు. అంతే కాకుండా ఎక్కువ ఇబ్బందులు ఎదురు అవుతాయి. నిజానికి ద్రవ పదార్థాలు బరువు ఎక్కువగా ఉంటాయి. అందు వల్ల ఒత్తిడి అనేది ఎక్కువగా ఏర్పడుతుంది.
Advertisement
మండే ద్రవ పదార్ధాలు, వాయువులు, అలాగే నీరు వంటి పదార్ధాలు వంటి వాటిని తీసుకెళ్లే వాహనం ఎక్కువ గా స్థిరత్వం కలిగి ఉండాలి. స్థీరత్వాన్ని కోల్పోకుండా ఎక్కువ సమయం ఉండాలి. అలా ఎక్కువ సమయం స్థిరత్వం ఉండాలంటే.. గురుత్వ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి. అంటే భూమికి వీలు అయినంత దగ్గర గా ఉండాలి. అయితే ట్యాంకర్లు రౌండ్ ఆకారంలో ఉంటేనే భూమికి దగ్గర ఉంటుంది. అదే దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంటే పైన ఉండే భాగం భూమికి దూరం గా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ద్రవ పదార్థాలు, వాయువులు తీసుకేళ్లే ట్యాంకర్లను రౌండ్ ఆకారంలో ఉంచుతారు.