Home » నాన్న చివరి కోరిక తీర్చుతూనే అమ్మ ప్రాణాలను విడిచింది.. ఎమోషన్ గా ఘంటసాల తనయుడు..!

నాన్న చివరి కోరిక తీర్చుతూనే అమ్మ ప్రాణాలను విడిచింది.. ఎమోషన్ గా ఘంటసాల తనయుడు..!

by Anji
Ad

ప్రముఖ గాయకుడు ఘంటసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఘంటసాల పాటలు పాడితే మనసంతా పులకరించిపోతుంది. ఎలాంటి బాధలో ఉన్నా.. ఆయన స్వరం వింటే మనసు చాలా తేలిక అవుతుంది. సింగర్ గా  మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఘంటసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.. ఘంటసాలకు ఇద్దరు భార్యలు అనే విషయం చాలా మందికి తెలియదు.

Advertisement

 ఘంటసాల రెండవ భార్య సరళ కుమారుడు రవికుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ ఘంటసాల మరణం  గురించి, చివరి కోరిక గురించి తెలియజేశారు. నాన్న గారికి మానస సరోవరం యాత్ర వెళ్లాలని ఎప్పటి నుంచో ఉండేది. అయితే ఆయన ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు.  అయితే నాన్నగారి కోరికను తీర్చడం కోసం తన తల్లి సరళ మానస సరోవరం యాత్ర ప్రారంభించిందని వెల్లడించారు. తన తల్లి మానస సరోవర యాత్ర వెళ్ళినప్పుడు తన యాత్రకు సంబంధించిన అన్ని విషయాలను ఫోన్ చేసి మాకు తెలియజేసింది.  

Advertisement

Also Read :  అక్కడ లభించే తేనె చేదుగా ఉంటుందనే విషయం మీకు తెలుసా ? 

ఈ విధంగా యాత్ర పూర్తయిన తర్వాత తాను యాత్ర పూర్తి చేసుకున్నానని మాకు తెలియజేసి అందరికీ బాయ్ చెప్పి టెంట్ లోకి వెళ్లి పడుకున్నారు. అలా నిద్రలోకి వెళ్లిన ఆమె శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు అంటూ రవికుమార్ గుర్తుచేసుకున్నారు. ఈ విధంగా నాన్నగారి కోరికను తీర్చడం కోసం అమ్మ ప్రాణాలను కోల్పోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా  రవికుమార్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :  సొహెల్ నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా ?

Visitors Are Also Reading