కూరల్లో తాలింపు వేసుకునే గింజల్లో ఆవాలు కూడా ఉంటాయి. ప్రతి కూరలోనూ ఆవాలను తాలింపు లో వేసుకుంటారు. ముఖ్యంగా ఊరగాయల్లో ఆవాలను ఎక్కువగా వేస్తుంటారు. ఆవాలతో కూరకు రుచితో పాటు ఔషధ గుణాలు కూడా లభిస్తాయి. అయితే ఆవాలను వంటలు మరియు ఆయుర్వేదంలోనే కాకుండా దిష్టిని దూరం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆవాలతో దురదృష్టం పోవడంతో పాటు నరదృష్టి కూడా దూరం అవుతుంది. అయితే దిష్టి తీయడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….
కొన్ని ఆవాలను ఒక నీటితో నిండిన కుండలో వేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. అలా అవాలు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల మనకు ఉన్న దురదృష్టం దూరం అవుతుంది. అంతే కాకుండా ఇకపై దురదృష్టం దరిచేరకుండా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లాంటి సమస్యలను కూడా ఇలా చేయడం ద్వారా అధిగమిస్తారు. అదేవిధంగా అనేక అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయి. నరదిష్టి వల్ల అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇంతకాలం ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఆర్థికంగా దృఢంగా ఉన్నవారు కూడా దిష్టి తగిలి ఒకేసారి సమస్యల వలయంలో చిక్కుకుంటారు.
Advertisement
Advertisement
అయితే కూరలో వేసే ఆవాలతో కూడా మనం నరదిష్టిని దూరం చేయవచ్చు. దానికోసం 7 ఆవ గింజలు, 7 ఎర్ర మిరపకాయలు సైంధవ లవణం తీసుకుని వాటిని ఎడమచేతి గుప్పిట్లో పట్టుకుని వ్యక్తి తల చుట్టూ తిప్పాలి. ఆ తర్వాత మామిడి చెక్కలతో వెలిగించిన మంటలో ఈ మూడింటిని వేయాలి. ఇలా చేయడం ద్వారా నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా దిష్టి తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వారికి గురువారం ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు.
ALSO READ : ఆఫీస్ లో ఈ వాస్తు టిప్స్ పాటిస్తే వ్యాపారంలో మీకు తిరుగు ఉండదు…!