Home » అలా పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్..!

అలా పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాల్లో నటించడంతో పాటు టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమాలో శివగామిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో రమ్యకృష్ణ కి ఉన్న క్రేజ్ గురించి స్వయంగా తనకు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Advertisement

1998 లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ కావడం విశేషం. 1998 సంవత్సరం రమ్యకృష్ణ కెరియర్ ప్రారంభం ఎంతో ప్రత్యేకమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె నటించిన ఊయల, కంటే కూతుర్నే కను, దీర్ఘ సుమంగళీభవ, చంద్రలేఖ, లవ్ స్టోరీ వంటి అద్భుతమైన సినిమాలు విడుదల అయ్యాయి. రమ్యకృష్ణ ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా ఆమె ఇంటర్వ్యూలో కూడా ఇంత బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. ఇకపోతే.. ఆ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ.. సె* బాంబ్ అనే పేరు రావడంపై ఆ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. “నన్ను అలా అంటే  అది కేవలం వెండితెర వరకు మాత్రమే పరిమితం.  

Advertisement

Also Read :  Hardik Pandya : ఆ బ్యూటీని రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా?

కానీ నిజ జీవితంలో అలా అస్సలు ఉండను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. అందరికీ అందుబాటులో ఉన్నాను అని అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం. ఎవరు ఏమనుకున్నా నేను బాధపడను. నేనేంటో నాకు తెలుసు. నన్ను అలా పిలవడంపై నేను గర్వపడుతున్నాను. జనం నన్ను అలా అంటుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను” అని రమ్యకృష్ణ తెలిపింది. 1998లో ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా రమ్యకృష్ణ చెప్పిన సమాధానం గురించి పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

Also Read :  Prabhas To PK : 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు

Visitors Are Also Reading